కర్నూల్

సామవేదం షణ్ముఖశర్మ ప్రవచనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, అక్టోబర్ 15:శ్రీశైలం మహాక్షేత్రంలో శనివారం నుండి 7 రోజుల పాటు ప్రముఖ ప్రవచకులైన శ్రీ సామవేదం షణ్ముఖశర్మ వారి ప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఈఓ నారాయణ భరత్‌గుప్తా తెలిపారు. శనివారం 6.30 గంటల నుంచి ఆలయం లోపల గల అక్క మహాదేవి అలంకరణ మండపంలో 7 రోజుల పాటు శ్రీశైల మహాక్షేత్రంలోని పలు ఘట్టాలపై క్షేత్ర విశిష్టత, శ్రీశైల మహత్యం గురించి ప్రవచకులు ప్రవచించడం జరుగుతుంది. మొదటి రోజు సాంప్రదాయబద్దంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సాంప్రదాయబద్దంగా గణపతి పూజ అనంతరం ప్రవచకుడును పూలమాలతో ఈఓ సత్కరించారు.