కర్నూల్

స్వగ్రామానికి చిన్నారి చైత్ర మృతదేహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బేతంచెర్ల, అక్టోబర్ 17:పట్టుతప్పి రైలు కిటికీలోంచి పట్టాలపై పడి మృతిచెందిన చిన్నారి చైత్ర మృతదేహాన్ని సోమవారం విజయనగరం జిల్లా, మరమృగధం మండలంలోని స్వగ్రామమైన మరివలస గ్రామానికి పోలీసులు తరలించారు. 16వ తేదీ రాత్రి హౌరా నుంచి వాస్కోడిగామాకు వెళ్లే రైలులో నుంచి తల్లి ఒడి నుంచి పట్టుతప్పి పట్టాలపై పడి మృతి చెందిన చైత్ర సంఘటన స్థానికుల్లో దిగ్భ్రాంతి మిగిల్చింది. చిన్నారి మృతదేహన్నికి డోన్ ప్రభుత్వ వైద్యశాలలో సిఐ సుబ్రహ్మణ్యం, ఎస్‌ఐ తిరుపాలు, రైల్వే పోలీసుల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించి చిన్నారి తల్లి లక్ష్మి, బాబాయ్ రామస్వామిలకు అప్పగించారు. అనంతరం ప్రత్యేకంగా పోలీసులు స్వగ్రామానికి తరలించారు.

పట్ట్భద్రుల ఎమ్మెల్సీ
స్వతంత్ర అభ్యర్థిగా ఓబులేష్
కర్నూలు సిటీ, అక్టోబర్ 17:పశ్చిమ రాయలసీమ పట్ట్భద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా యాట ఓబులేష్‌ను స్వతంత్ర అభ్యర్థిగా నిలపాలని విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ మేరకు సోమవారం నగరంలోని ఆర్‌సి రెడ్డి కాలేజీలో బహుజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి ఓబులేష్ మాట్లాడుతూ నిరుద్యోగ భృతి కింద కనీస వేతనం ఇవ్వాలని, అలా కాని పక్షంలో 3 ఎకరాల సాగుభూమి ఇవ్వాలని ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ప్రతి ఏడాది ఉద్యోగ నియామకాలకు సంబంధించిన క్యాలెండర్‌ను ప్రకటించే విధంగా చూస్తామన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో కేంద్ర, రాష్ట్ర సర్వీసుల ప్రభుత్వరంగ సంస్థల శిక్షణకై స్టడీ సర్కిల్ ఏర్పాటు, ప్రతి కళాశాల నుంచి విద్యార్థులు ఉద్యోగావకాశాలు పొందే విధంగా ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని పోరాడుతానన్నారు. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ కళాశాల ఏర్పాటుకు కృషి చేయాలని విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు ఏకగ్రీవంగా తీర్మానం చేసి, తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారన్నారు. సమావేశంలో ప్రజాసంఘాల నాయకులు త్యాగరాజ్, కొమ్ముపాలెం శ్రీనివాస్, సుబ్బరాయుడు, సాయిబాబా, కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు దామోదరం నాగశేషులు, సుబ్బయ్య, ఎన్‌ఎస్‌యుఐ, ఏబివిపి, పిడిఎస్‌యు, ఆర్‌వియు, బిడిఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, టిఎన్‌ఎస్‌ఎఫ్, ఆర్‌పిఎస్‌ఎఫ్, బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి పరిషత్ వంటి విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.