కర్నూల్

నంద్యాల టిడిపిలో సమసిపోని వర్గపోరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, అక్టోబర్ 17:నంద్యాల తెలుగుదేశం పార్టీలో వర్గపోరు రోజురోజుకు నాయకులు, కార్యకర్తల మధ్య దూరం పెంచుతున్నదే గాని కలిసిపనిచేసే పరిస్థితి కనబడడం లేదు. నంద్యాలలో మొదటి నుంచి టిడిపికి మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి ఇన్‌చార్జిగా వ్యవహరించేవారు. నంద్యాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వైకాపా నుంచి ఎన్నికైన భూమా నాగిరెడ్డి టిడిపి లో చేరినప్పటి నుంచి ఇద్దరు నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయి పనిచేస్తున్నారు. భూమా నాగిరెడ్డి టిడిపి తీర్థం తీసుకోగానే అప్పటికే సీనియర్ టిడిపి నాయకుడిగా మాజీమంత్రిగా వ్యవహరిస్తున్న ఎన్‌ఎండి ఫరూక్ భూమాతో కలిసి పనిచేసేందుకు ఉత్సాహం చూపించడంతో పాటు స్వయంగా తానే భూమాను తన కార్యాలయానికి ఆహ్వానించడం విశేషం. దీంతో నంద్యాల టిడిపిలో శిల్పా గ్రూపు, భూమా, ఫరూక్ గ్రూపులుగా ముద్రపడి పనిచేస్తున్నాయి. శిల్పా వర్గం నిర్వహించే కార్యక్రమాలకు భూమా, ఫరూక్ వర్గాలు దూరంగా ఉండడం, భూమా, ఫరూక్ వర్గాలు పాల్గొనే కార్యక్రమాలకు శిల్పా వర్గం దూరంగా ఉంటు వచ్చింది. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరినప్పటి నుంచి రెండు గ్రూపులు కలిసి ఇంతవరకు పనిచేసిన దాఖలాలు లేవు. అధిష్టానం ఇద్దరిని కలిపేందుకు జిల్లాస్థాయిలో డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి, ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డిని సమన్వయ కమిటీగా నియమించి శిల్పా, భూమా గ్రూపుల మధ్య బేధాభిప్రాయాలను తొలగించి కలిసి పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అధిష్టానం ఆదేశించినప్పటికీ నంద్యాలలో రెండు గ్రూపులు ఇంతవరకు కలిసింది లేదు. రెండు గ్రూపుల పంచాయతీ రెండుమూడు సార్లు టిడిపి అధినేత చంద్రబాబు వద్దకు చేరినా అక్కడ కూడా ఇద్దరి మధ్య సయోధ్య కుదరలేదు. దీంతో నంద్యాల నియోజకవర్గ పరిధిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో రెండు గ్రూపులు వేర్వేరుగా పనిచేస్తున్నాయే తప్ప ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఒకే వేదికపై కలిసిన దాఖలాలు లేవు. ఇంతలో రాజ్యసభ ఎన్నికలు రావడం టిజి వెంకటేశ్ రాజ్యసభకు ఎంపిక కావడం వెనుక ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్రత్యేక కృషి చేయడం పట్ల ఫరూక్ వర్గం కూడా ఆయనకు దూరం అయింది. ప్రస్తుతం నంద్యాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మూడు గ్రూపులుగా విడిపోయి మూడుముక్కలైంది. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. మూడు గ్రూపులు కలిసి పనిచేస్తే నంద్యాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎదురే ఉండదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. టిడిపి పరిస్థితి మూడు గ్రూపులుగా విడిపోయి ఒకరిలో ఒకరు లేకపోవడంతో వైకాపా ఇన్‌చార్జి బాధ్యతలు చేపట్టిన యువకుడు మలికిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నంద్యాల నియోజకవర్గంలో పాతకాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను చేరదీస్తూ వైకాపాను బలోపేతం చేసేందుకు గడపగడపకు వైకాపా కార్యక్రమం ద్వారా యువతను ఆకట్టుకుని దూసుకునిపోతున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న గ్రూపు తగాదాల కారణంగా అక్కడ ఇమడలేక ఏ గ్రూపులో పనిచేస్తే అవతలి గ్రూపు ఆగ్రహం చెందుతుందని భావించిన కార్యకర్తలు సైతం తెలుగుదేశం పార్టీకి దూరమై వైకాపాను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికైనా అధిష్టానం చొరవ తీసుకుని నంద్యాలలో గ్రూపు తగాదాలకు చరమగీతం పాడి మూడు గ్రూపులను కలిపి కలిసికట్టుగా పనిచేస్తే తప్ప వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో గెలుపొందే అవకాశం ఉంది. జిల్లా సమన్వయ కమిటీతో పాటు అధిష్టానం వర్గపోరుపై దృష్టి సారించి అందరిని కలిపి పనిచేసేలా దిశా నిర్ధేశం చేస్తే బాగుంటుందని సోమవారం నంద్యాలలో జరిగిన అసెంబ్లీ స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బాహాటంగానే ఇన్‌చార్జిలకు సూచన ప్రాయంగా తెలుపడం గమనార్హం.