కర్నూల్

యువభేరి పేరుతో విద్యార్థులను తప్పుదోవ పట్టించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, అక్టోబర్ 21: యువభేరి పేరు తో విద్యార్థులను తప్పుదోవ పట్టించొద్దుని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు టిడిపి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి హితవు పలికారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నాగేశ్వరరావుయాదవ్ అధ్యక్షతన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శిల్పా మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటం సాధ్యం కాదని, ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా సిఎం చంద్రబాబు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి కృషి చేస్తుంటే జగన్ వాటికి అడ్డుతగులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని, వాటిని ప్రజల దరికి చేర్చి పార్టీ పట్ల నమ్మకం పెంపొందిస్తామన్నారు. అందులో భాగంగా నవంబర్ 1వ తేదీ నుంచి చైతన్యయాత్రలు, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపడుతామన్నారు. అలాగే ఈ నెల 27,28 తేదీల్లో నియోజకవర్గ సమావేశాలు నిర్వహించి గ్రామ, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను ప్రజల దరికి చేరుస్తామన్నారు. ఇక గ్రామ స్థాయి నుంచి పట్ట్భద్రులను గుర్తించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పిస్తామన్నారు. ఈ 24వ తేదీ నిర్వహించే జిల్లా సమన్వయ కమిటీ సమావేశానికి డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తితో పాటు ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా ఇన్‌చార్జి వర్లరామయ్య ముఖ్యఅతిథులుగా పాల్గొంటారన్నారు. కావున ఆ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్‌చార్జిలు, ఎమ్మెల్యేలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ కేంద్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కెడిసిసి బ్యాంక్ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ధనారెడ్డి, కెడిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ కాతా అంకిరెడ్డి, బాబురాజ్, పర్వేజ్, హనుమంతరాయచౌదరి, మల్లెల పుల్లారెడ్డి పాల్గొన్నారు.