కర్నూల్

నవంబర్ లోపు హౌసింగ్ నిర్మాణాలు ప్రారంభించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, అక్టోబర్ 21:జిల్లాలో ఎన్‌టిఆర్ గ్రామీణ హౌసింగ్ పథకం కింద కేటాయించిన 10,600 గృహాలను నవంబర్ లోపు మార్కింగ్‌తో పాటు నిర్మాణాలు ప్రారంభించాలని కలెక్టర్ విజయమోహన్ హౌసింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం హౌసింగ్ ఇంజినీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంజూరైన 10,600 గృహాల్లో నవంబర్ మొదటి వారంలో 1300, 2వ వారంలో 2,600, 3వ వారంలో 4వేలు, 4వ వారంలో 2,700 గృహాల నిర్మాణ పనులను ప్రారంభించాలన్నారు. ఎన్‌టిఆర్ గ్రామీణ హౌసింగ్ పథకం కింద జిల్లాకు 4,246 గృహాలు కేటాయించారని, ఇప్పటి వరకూ 3,437 గృహాలకు పరిపాలన అనుమతులు ఇచ్చామని, వీటిని త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్‌టిఆర్ అప్పర్‌గ్రేడేషన్ పథకం కింద 10వేల గృహాలను కేటాయించామని, ఇందులో 3,762 గృహాలకు ప్రతిపాదనలు రాగా, 449 గృహాలకు పరిపాలన అనుమతి ఇచ్చామన్నారు. ఇందిర ఆవాస్ యోజన కింద ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ 92.27 శాతం ముందున్నారని, కర్నూలు ఇఇ 75.27, ఆదోని ఇఇ 71.62శాతంతో ప్రగతిలో వెనుకపడ్డారని, ఆదోని, కర్నూలు ఇఇలు వంద శాతం ప్రగతి సాధించేందుకు కృషి చేయాలన్నారు. సమావేశంలో హౌసింగ్ పిడి రాజశేఖర్, ఆదోని, కర్నూలు, నంద్యాల ఇఇలు పద్మనాభం, కెఎస్ ప్రసాదరెడ్డి, సుధాకర్‌రెడ్డి, డిఇలు, ఏఇలు పాల్గొన్నారు.