కర్నూల్

130 ప్యాకెట్ల విత్తన సబ్సిడీ మాయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజామల, అక్టోబర్ 23:సంజామల సహకార బ్యాంకులో సబ్సిడీ విత్తన శెనగ ప్యాకెట్లు మాయమైన సంఘటన శనివారం రాత్రి వెలుగులోకి వచ్చింది. ఈ నెల ప్రారంభం నుంచి అధికారులు మండల పరిధిలోని రైతులకు గ్రామాల వారీగా విత్తనాల పంపిణీ చేశారు. అప్పడి నుంచి విత్తన పంపిణీ విషయంలో రైతులు, అధికారులకు మధ్య గొడవలు జరుగుతూ వచ్చాయి. 25న నొస్సం, అక్కంపల్లె గ్రామాలకు వెళ్లి అక్కడే రైతులకు విత్తన శెనగ పంపిణీ చేశారు. పకడ్బండీగా విత్తన పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించినా అధికారులు నిబంధనలను తుగలో తొక్కారు. సహకార బ్యాంకు అధికారులు, హమాలీలు, దళారీల మధ్యలో 130 ప్యాకెట్లు గల్లంతు కావడంతో అధికారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రభుత్వం సబ్సిడీ ద్వారా 25 కిలోల ప్యాకెట్‌ను రూ. 1480లకు రైతులకు అందిస్తోంది. బహిరంగ మార్కెట్‌లో క్వింటా శెనగలు ధర రూ. 9,600 పలుకుతోంది. దీంతో సబ్సిడీ విత్తన శెనగకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో 130 ప్యాకెట్లు ఎలా మాయయ్యాయో తేలాల్సి ఉందని అధికారులు తలలు పట్టుకున్నారు.