కర్నూల్

ఆదోనిలో పూర్తికాని బైపాస్ రోడ్డు.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, అక్టోబర్ 23:ఆదోని పట్టణంలో జనాభాతో పాటు వాహనాలు పెరిగి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో పట్టణ వాసులు బెంబేలెత్తుతున్నారు. భారీ వాహనాలు కూ డా పట్టణం గుండా రాకపోకలు సాగిస్తున్నాయి. ఇదిలా ఉండగా గత 20 ఏళ్లుగా బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తికాకపోవడం నేతల చర్యలకు అద్దం పడుతోంది. నేషనల్‌హైవే రోడ్డు ఆదో ని పట్టణం నుంచి వెళ్లే విధంగా ప్రణాళికలు రూపొందించారు. అయితే రోడ్లకు పక్కనే ఉన్న తమ వాణిజ్య, వ్యాపార సముదాయాలను పడగొడతారనే ఉద్దేశ్యంతో ఆయా నాయకులు నేషనల్‌హైవే రోడ్డు వేయకుండా అడ్డుపడినట్లు తెలుస్తోంది. కాగా బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తే భారీ వాహనాలు బైపాస్ గుండా వెళ్తాయి, తద్వా రా కొంత వరకైనా ట్రాఫిక్ తగ్గుతుంది. కానీ నేతలు కోర్టుకెళ్లి స్టే తీసుకు రావవడంతో బైపాస్ రోడ్డు నిర్మాణానికి బ్రేక్ పడింది. అయితే కోర్టుకెళ్లిన నేతతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించి బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలన్న ఉద్దేశ్యం జిల్లా ఉన్నతాధికారులకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ అధికార పార్టీ నాయకులకు కానీ లేకపోవడంపై పట్టణ వాసులు మండిపడుతున్నారు. కనీసం పట్టణంలో మాస్టర్ ప్లాన్ అమలు చేసి రోడ్ల వెడల్పు చేసే క్రమంలో భాగంగా కూల్చే నిర్మాణాలకు డబ్బులు చెల్లించి రోడ్లు వెడల్పు చేసే కార్యక్రమాలను కూడా చేపట్టకపోవడం శోచనీయం. ఒకప్పుడు మున్సిపాలిటీకి నిధుల కొరత ఉండేది. అయితే ఇప్పుడు ఆదోని మున్సిపాలిటీకి పుష్కలంగా నిధులు వస్తుండగా ఆ నిధులను ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తున్నారు. పైగా అమృత్ పథకం కింద ఆదోని మున్సిపాలిటీ ఎంపికైంది. కావున మాస్టర్ ప్లాన్ అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పట్టణ జనాభా 2 లక్షలు దాటింది. దీనికి తోడు మండిగిరి, సాదాపురం పంచాయతీలు పట్టణంలో కలిసిపోయాయి. ఈ రెండు పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేసుకుంటే ఆదోని కార్పొరేషన్ స్థాయికి ఎదుగుతుంది. దీనికి అనుగుణంగా పట్టణంలో ఆటోలు, ద్విచక్ర వాహనాలు, లారీల సంఖ్య పెరిగింది. పైగా కర్ణాటక ప్రాంతాల నుంచి భారీ వాహనాలు సరుకులతో తెలంగాణ రాష్ట్రానికి వెళ్తుంటాయి. అందువల్ల ఆదోనిలో వేసిన రోడ్లు భారీ వాహనాల ధాటికి తట్టుకోవడం లేదు. అందువల్ల రోడ్లు గుంతలమయంగా మారాయి. దీనికి తోడు నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. వారం రోజుల క్రితం సాయిబాబా నగర్ వద్ద వాహనం ఢీకొట్టడంతో మహిళ మృతిచెందింది. కృష్ణుని ఆలయం వద్ద ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఒక యువకుడు మృతి చెందాడు. విబిఎస్ సర్కిల్, మున్సిపల్ కార్యాలయం వద్ద రోజూ చిన్నపాటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్న మెయిన్ రోడ్డు, ఓవర్ బ్రిడ్జిపై ప్రతి రోజూ ట్రాఫిక్ స్తంభిస్తోది. దీంతో పోలీసులు గంటల తరబడి శ్రమించి ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యపై పోలీసులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్‌హెచ్ 167 రోడ్డును ఆదోని పట్టణం గుండా వేసేందుకు జాతీయ రోడ్ల నిర్మాణం సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే రోడ్లుకు ఇరువైపులా ఉన్న తమ వాణిజ్య, వ్యాపార సంస్థలు తొలగిస్తారన్న ముందు చూపు ఉన్న కొందరు నాయకులు కేంద్ర ప్రభుత్వానికి పట్టణం గుండా నేషనల్ హైవే రోడ్డు వద్దని లేఖలు రాశారు. అంతేకాకుండా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును కలిసి నేషనల్ హైవే రోడ్డు పట్టణం గుండా వద్దంటూ వినతి పత్రం ఇచ్చినట్లు సమాచారం. అయితే నేషనల్ హైవే రోడ్డు నిర్మాణం జరిగితే రోడ్డు వెడల్పు చేసే క్రమంలో పడగొట్టిన నిర్మాణాలకు నష్ట పరిహారం అందడంతో పాటు 30 ఏళ్ల వరకూ ఎటువంటి ట్రాఫిక్ సమస్య ఉండదని ప్రజలు భావించగా నేతలు అడ్డుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఆక్రమణల తొలగింపు వల్ల రోడ్లు విస్తరణ జరగదు. కావున మాస్టర్ ప్లాన్ అమలు చేయాల్సిన అవసరం ఎంది. అలాగే కేంద్ర ప్రభుత్వం నేతల మాటలను పక్కన పెట్టి నేషనల్ హైవే రోడ్డు పట్టణం నుంచే నిర్మించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. నేషనల్ హైవే రోడ్డు వల్ల ఎన్నో ఉపయోగాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. కావున ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలంటే మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ అమలు చేయాలి. లేదా నేషనల్ హైవే రోడ్డు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని బిజెపి నాయకులు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్, వైకాపా నాయకులు అఖిల పక్షంగా ఏర్పడి ఆందోళన చేయడమే కాకుండా సిఎం చంద్రబాబు వద్దకు వెళ్లి బైపాస్ రోడ్డు నిర్మాణం ఆవశ్యకతను వివరించి పూర్తి చేయడానికి కనీస సన్నాహాలు చేయకపోవడంపై ఆదోని వాసులు తప్పుపడుతున్నారు. ఇకనైనా ఆదోనిలో ట్రాఫిక్‌ను నియంత్రించడానికి తీసుకోవాల్సిన చర్యలపై రాజకీయ పార్టీలు ముందుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.