కర్నూల్

కొనసాగుతున్న వడగాలులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఏప్రిల్ 22:జిల్లాలో వడగాలుల ప్రభావం కొనసాగుతూనే ఉంది. వాతావరణ అధికారుల అంచనా ప్రకారం మరో వారం రోజులకు పైగా పరిస్థితిలో మార్పు రాదని వెల్లడిస్తున్నారు. జిల్లాలో సగటున 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా నంద్యాలలో 42, ఆదోనిలో 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 11 గంటల నుంచే వడగాలుల తీవ్రత కారణంగా నగర ప్రజలు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వృక్ష సంపద లేకపోవడమే వడగాలుల తీవ్రతకు ప్రధాన కారణమని వాతావరణ నిపుణులు వెల్లడిస్తున్నారు. చెట్లు ఉంటే వేడి గాలులను అడ్డుకుంటాయని దాంతో వాటి తీవ్రత తగ్గుతుందని వెల్లడిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో కాంక్రీటు నిర్మాణాలు కూడా మరో కారణమని స్పష్టం చేస్తున్నారు.