కర్నూల్

సర్వేలో నమోదు చేసుకోకుంటే ప్రభుత్వ పథకాలందవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, అక్టోబర్ 27: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాధికార సర్వేలో తమ కుటుంబ వివరాలు నమోదు చేసుకోని వారికి రానున్న కాలంలో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు అందవని స్పెషల్ కలెక్టర్ ఎంవి సుబ్బారెడ్డి తెలిపారు. గురువారం నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో సాదికార సర్వేపై డీలర్లు, సర్వే పర్యవేక్షకులతో ఆర్డీవోతో కలసి సమీక్షా సమావేశం నిర్వహించారు. నంద్యాల పురపాలక సంఘం సాధికార సర్వేలో జిల్లాలోనే చాలా వెనుకబడి పోయిందని, దీంతో జిల్లా కలెక్టర్ తనను నంద్యాల పురపాలక సంఘానికి సాధికార సర్వే స్పెషల్ ఆఫీసర్‌గా నియమించినట్లు ఆయన తెలిపారు. సాదికార సర్వేలో నంద్యాల గ్రామీణ ప్రాంతంలో 86 శాతం నమోదు కాగా, నంద్యాల పట్టణ ప్రాంతంలో కేవలం 56 శాతం మాత్రమే నమోదైందన్నారు. పట్టణ పరిధిలోని రేషన్ దుకాణాలలో 86 శాతం రేషన్‌కార్డుదారులు సరుకులు తీసుకుంటున్నారని, మరి సర్వేలో మాత్రం 56 శాతమే నమోదు కావడం వెనుక కారణాలను అనే్వశించి ఈ నెల ఆఖరునాటికి పట్టణ పరిధిలో సర్వే వేగవంతం చేసి 90 శాతానికి చేరుకొనే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. శుక్రవారం పట్టణంలోని రేషన్ డీలర్లు అందరు తమ వద్ద సరుకులు తీసుకుపోతున్న కుటుంబాల వివరాలు తహశీల్దార్‌కు అందజేయాలని, రేషన్ సరుకులు తీసుకుపోతున్న వారి వివరాలతో పాటు వారి ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. పురపాలక సంఘం పరిధిలో సాదికార సర్వే చేస్తున్న ఎన్యుమరేటర్లకు డీలర్ల వారిగా నమోదుచేసుకోని వారిని గుర్తించి ఈ నెలాఖరులోపు పూర్తి చేసేందుకు లక్ష్యాలను నిర్ధేశించామన్నారు. సాధికార సర్వేలో వెనుకబడిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ నెల 30వ తేదీ వరకు సాధికార సర్వే పూర్తి చేసి నవంబరు నెల 1, 2, 3 తేదీలలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామంలో సర్వే నిర్వహించిన ఎన్యూమరేటర్ సమావేశం నిర్వహించి ఆ గ్రామంలో సర్వేలో నమోదు కాని కుటుంబాలను గుర్తించి 4, 5, 6, 7 తేదీలలో సర్వే పూర్తి చేయవలసి ఉంటుందన్నారు. అదేవిధంగా నంద్యాల పట్టణ పరిధిలో సర్వేలో నమోదుచేసుకోని వారి వివరాల కోసం పురపాలక సంఘం కార్యాలయంలో 5 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి సర్వేలో తమ పేర్లు నమోదు చేసుకుని వారు కౌంటర్ల వద్ద తమ వివరాలు, చిరునామా, ఫోన్ నెంబరు అందజేస్తే ఎన్యూమరేటర్లు వారి ఇంటి వద్దకు వచ్చి వివరాలు నమోదు చేసుకుంటారన్నారు. సాదికార సర్వేలో 2011 జనాభ లెక్కల ఆధారంగా సర్వే చేస్తున్నారని, అయితే ఈ మధ్యకాలంలో పెరిగిన కుటుంబాల వివరాలను కూడా తమకు ఇచ్చిన పరిధిలో ఉంటే వారిని కూడా పరిగణలోకి తీసుకొని సర్వే పూర్తి చేయవలసి ఉంటుందన్నారు. సాధికార సర్వే పూర్తయిన అనంతరం కేవైసి పూర్తి చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో నంద్యాల ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి, తహశీల్దార్ శివరామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ విజయభాస్కర్‌నాయుడు, డీలర్లు, సర్వే పర్యవేక్షకులు పాల్గొన్నారు.