కర్నూల్

సిఎం చంద్రబాబు పర్యటనకు భారీ బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, నవంబర్ 4:ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన నేపథ్యంలో శుక్రవారం ఎస్పీ ఆకే రవికృష్ణ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. సిఎం పర్యటించే కర్నూలు నగరంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఆదేశించారు. సిఎం పాదయాత్రలో భద్రత దృష్ట్యా బాణసంచా, పూలు, బొకేలను పూర్తిగా నిషేధించామన్నారు. లౌడ్ స్పీకర్లు పెట్టరాదని, పాదయాత్రలో ప్రజలు సైతం జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. బందోబస్తుకు 11 మంది డీఎస్పీలు, 28 మంది సిఐలు, 82 మంది ఎస్‌ఐలు, 138 మంది ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 585 మంది కానిస్టేబుళ్లు, 55 మంది మహిళా పోలీసులు, 200 మంది హోంగార్డులు, 4 ప్లాటూన్ల ఏఆర్ బలగాలు, ఇతర జిల్లాలతో కలిపి మొత్తం 13 స్పెషల్ పార్టీ బృందాలను కేటాయించామన్నారు. ఇప్పటికే పోలీసు జాగిలాలు, బాంబ్‌స్క్వాడ్ బృందాలతో సిఎం పర్యటన ప్రాంతాలే కాకుండా, జిల్లాలో పలు చోట్ల విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రత్యేక మఫ్టీ పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. సిఎం పర్యటనలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ తెలిపారు.