కర్నూల్

వైభవంగా సాయి మందిరం భూమిపూజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డోన్, నవంబర్ 4:పట్టణ సమీపం లో జాతీయ రహదారి పక్కన నిర్మించతలపెట్టిన శ్రీషిరిడీ సాయిబాబా మం దిర నిర్మాణానికి శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. వంద మంది బ్రాహ్మణుల వేదమంత్రోచ్ఛారణలు, వేలాది మంది భక్తుల జయ జయ ధ్వనుల మధ్య భూమిపూజ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఆ ప్రాంతమంతా జై సాయిరామ్, జైజై సాయిరామ్ అం టూ భక్తుల నినాదాలతో హోరెత్తిపోయింది. తొలుత పట్టణంలోని పాత బస్టాండ్ నుంచి వేలాది మంది భక్తులతో ప్రారంభమైన ప్రదర్శన సుమారు 2 కిలోమీటర్లు సాగింది. 2వేల మంది దంపతులు కళశాలతో ముందు నడవగా వేలాది మంది భక్తులు ఆలయ నిర్మాణంలో తమ వంతు భాగస్వా మ్యం వుండాలనే సదుద్దేశ్యంతో ఇటుకలను శిరస్సున వుంచి పాదయాత్రగా తరలివచ్చారు. ఇందులో నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి కెఇ ప్రతాప్ దంపతులు, మాజీ జడ్పీటిసి కెఇ జయన్న దంపతులు ఇటుకలు, కళశాలు తీసుకుని ముందు నడిచారు. పాత బస్టాం డ్ నుంచి ప్రారంభమైన ప్రదర్శన గెస్ట్‌హౌస్, కెఇ మాదన్న నగర్, కొత్తబస్టాండ్, ప్రభుత్వ ఐటిఐ మీదుగా ఆల య ప్రాంగణం చేరుకుంది. కెఇ ప్రతా ప్, కెఇ జయన్న, కొట్రికె ఫణిరాజ్, ధర్మవరం సుబ్బారెడ్డి దంపతుల చేత భూమిపూజ చేయించారు. తొలి ఇటుకను అందించి కెఇ కుటుంబీకులు ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశా రు. అనంతరం వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్నారు. భూమిపూజ కార్యక్రమానికి శివస్వాములు, అయ్యప్ప స్వాములతో పాటు మహిళలు అధికసంఖ్యలో తరలివచ్చారు. కాగా సాయి మందిర నిర్మాణానికి రూ. 50,00,116 లను విరాళంగా ఇవ్వనున్నట్లు కెఇ ప్రతాప్ ప్రకటించారు. పట్టణంలో సాయి మందిర నిర్మాణం చేపట్టడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. మందిర నిర్మాణంలో అందరూ భాగస్వామ్యులు కావాలని కోరారు.
తరలి వచ్చిన ప్రముఖులు
సాయి మందిర భూమిపూజ కార్యక్రమానికి రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులు, పట్టణ ప్రముఖులు తరలివచ్చారు. కెయి కుటుంబీకులతో పాటు పిఎసి చైర్మన్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, మున్సిపల్ చైర్‌పర్సన్ కొట్రికె గాయత్రీదేవి, వైస్ చైర్మన్ కేశన్నగౌడ్, డోన్, ప్యాపిలి, ఎంపిపిలు టిఇ లక్ష్మిదేవి, సరస్వతి, మాజీ ఎంపిపి టిఇ శేషఫణి గౌడ్, ఏపిఐడిసి మాజీ డైరెక్టర్ ధర్మవరం సుబ్బారెడ్డి, గ్రానైట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టిఇ సత్యం గౌడ్, మాజీ సర్పంచ్ కేశవయ్య గౌడ్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఈర్లదినె్న వెంకటేశ్వర్లు, కోట్రికె ఫణిరాజ్, పుట్లూరు శ్రీనివాసులు, ఆలువాల సత్యం, పోచా ప్రభాకర రెడ్డి, భాష్యం వెంకట రమణతో పాటు పలువురు నాయకులు, వేలాది మంది భక్తులు తరలివచ్చారు.