కర్నూల్

కాపుల అభివృద్ధికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, నవంబర్ 6:కాపు, బలిజ, ఒంటరి వర్గాల ప్రజల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దపీట వేశారని డిప్యూటీ సిఎం, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ఆత్మకూరు పట్టణంలోని శ్రీచౌడేశ్వరీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్మించిన కాపు, బలిజ కల్యా ణ మండపాన్ని ఆదివారం మంత్రి చినరాజప్ప ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దాదాపు 30 ఏళ్ల నుంచి కాపు, బలిజ, ఒంటరి జాతులు తమ సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు చేసినా అధికారంలో ఉన్న ఒక్క పార్టీ పట్టించుకోలేదన్నారు. దీంతో చంద్రబాబు ఎన్నికలకు ముందు కాపు, బలిజ, ఒంటరి జాతులను బిసి జాబితాలో చేరుస్తామని వాగ్దానం చేశారని, ఆ మేరకు పని చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే రాజ్యాంగబద్ధంగా ఎలాంటి సమస్య రాకూడదని మంజునాథ్‌కమిటీని సైతం ఏర్పాటు చేశారన్నారు. ఆ కమిటీ విచారణ చేసి నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన వెంటనే ఆయా కులాలను బిసి జాబితాలో చేర్చడం ఖాయం అన్నారు. అలాగే ఆయా జాతుల వెనుకబాటుతనాన్ని గమనించిన చంద్రబాబు వారి అభివృద్ధి కోసం కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ప్రతి ఏడాది రూ. వెయ్యి కోట్ల చొప్పున నిధులు మంజురు చేస్తున్నారన్నారు. పేద విద్యార్థులు విదేశాల్లో విద్యనభ్యసించడానికి రూ. 15 లక్షలు మంజురు చేస్తున్నారన్నారు. ప్రతి జిల్లాలో రూ. 5 కోట్లు, రెండెకరాల పొలాన్ని ప్రభుత్వం ఇస్తుందన్నారు. అయితే ప్రతిపక్ష నాయకులు కాపు, బలిజ, ఒంటరి జాతుల ఓట్లు పొందడానికి బిసిలు, కాపుల మధ్య చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఇక కొందరు వారి స్వార్థం కోసం ఉద్యమాలు చేస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగుల కోసం విజయవాడలో జాబ్‌మేళా ఏర్పాటు చేసి దాదాపు 1600 మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు.
కాపు, బలిజలు రాజకీయాల్లోకి రావాలి:మంత్రి మాణిక్యాలరావు
కాపు, బలిజలు రాజకీయల్లోకి రావాలని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు పిలుపునిచ్చారు. తద్వారా వారికి దక్కాల్సిన హక్కులను సాధించుకోవచ్చన్నారు. కాపు, బలిజ జాతుల అభివృద్ధికి పాటుపడతానని చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్నారు. కావున ఆయా వర్గాలు ఒక మాటపై ఉండాలన్నారు. ఇప్పటికే చంద్రబాబు కాపు, బలిజలకు అనేక రాజకీయ పదవులు ఇచ్చారన్నారు. అయితే ఆయా వర్గాల మధ్య కొందరు రాజకీయ నాయకులు చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు. అనంతరం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి శ్రీచౌడేశ్వరీమాత ఆలయ అభివృద్ధికి రూ. లక్ష విరాళంగా ఇచ్చారు. ఆత్మకూరులోని బలిజలు టిడిపి పుట్టినప్పటి నుంచి పార్టీ వెంట ఉన్నారన్నారు. ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ బలిజ సంఘం అంటేనే టిడిపి అన్నారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ స్పీకర్ వేదవ్యాస్, నగర పంచాయతీ చైర్మన్ నూర్‌అహమ్మద్, శిల్పా భవనేశ్వరరెడ్డి, వంగల శివరామిరెడ్డి, యుగంధర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీ్ధర్ తదితరులు పాల్గొన్నారు.