కర్నూల్

బలిజలకు స్వర్ణయుగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, నవంబర్ 6 : టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత బలిజలకు స్వర్ణయుగం వచ్చిందని ఏపి కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ పేర్కొన్నారు. నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఆదివారం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. సిఎం చంద్రబా బు కాపు, తెలగ బలిజ, ఒంటరి కులా ల అభివృద్ధి కోసం పాటుపడుతుంటే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ బిసిలు, కాపుల మధ్య చిచ్చుపెట్టడం తగదని హితవు పలికారు. సిఎం చంద్రబాబు కాపు కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు రుణాలు ఇవ్వటమే కాకుండా విదేశీ విద్య, సివిల్ సర్వీసెస్, వివిధ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇప్పిస్తున్నారన్నారు. అలాగే లక్షలాది మంది కాపు యువతకు జాబ్‌మేళా ద్వారా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారని వెల్లడించారు. బిసిలకు రిజర్వేషన్ శాతాన్ని పెంచి కాపులను బిసి జాబితాలో చేర్చేందుకు సిఎం చంద్రబాబు ప్రయత్నం చేస్తుంటే జగన్ రెండు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1956లో కాపులు, బలిజలు బిసి జాబితాలో ఉండేదవారని అయితే అప్పటి సిఎం నీలం సంజీవరెడ్డి బిసి జాబితా నుంచి తొలగించారని వివరించారు. దామోదరం సంజీవయ్య కాపులను బిసి జాబితాలో చేర్చితే ఆ తర్వాత ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన కాసు బ్రహ్మానందరెడ్డి బిసి జాబితా నుంచి తొలగించారన్నారు. అలాగే 2004, 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఎన్నికల సమయంలో కాపులను బిసి జాబితాలో చేర్చుతామని మేనిఫెస్టోలో పేర్కొని ఆ తర్వాత నమ్మకద్రోహం చేశారని ఆరోపించారు. కాపు, బలిజ తెలగ, ఒంటరి కులాలను బిసి జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఇడుపులపాయ నుంచి కడప వరకూ ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకూ పాదయాత్ర చేపడుతామన్నారు. వైఎస్ కాపులకు ద్రోహం చేస్తే ఆయన కుమారుడు జగన్ బిసిలు కాపుల మధ్య చిచ్చుపెట్టుతున్నాడని ఆ ప్రాంత ప్రజలకు తెలిసేందుకే అక్కడి నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆ పాదయాత్రలో ఆయా వర్గాల ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో అఖిల భారత కాపు సమాఖ్య అధ్యక్షుడు లక్ష్మీపతి, రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు వేల్పూరి శ్రీనివాసరావు, అఖిల భారత కాపునాడు రాష్ట్ర నాయకులు గవ్వల శ్రీనివాస్, శివ, అఖిల భారత కాపు సమాఖ్య జిల్లా అధ్యక్షుడు అనంతయ్య, తదితరులు పాల్గొన్నారు.