కర్నూల్

మే నుంచి జీఓ 279 అమలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, ఏప్రిల్ 22 : రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల మొదటి వారం నుంచి జీఓ నెం 279ను అమలు చేయటానికి ప్రయత్నం చేస్తోంది. ఆ జీఓ వల్ల మున్సిపాలిటీల్లో పని చేసే పారిశుద్ధ్య కార్మికుల ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని కార్మిక సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీల పరిధిలో తడి పొడి చెత్తను వేరు చేయడానికి పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. 350 ఇళ్లను క్లస్టర్స్‌గా ఏర్పాటు చేసి, వాటి పరిధిలో ఉన్న డ్రైనేజీలతో పాటు ఇళ్లలో పేరుకుపోయిన చెత్తను తొలగించడానికి కేవలం ఏడుగురు పారిశుద్ధ్య కార్మికులను నియమిస్తారు. 350 ఇళ్ల పరిధిలో ఏమి జరిగినా అందుకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ కాం ట్రా క్టు పారిశుద్ధ్య కార్మికులు కాంట్రాక్టర్ల పరిధిలో పని చేస్తుండగా వారికి వేతనాలను మున్సిపాటిటీ పరిధిలో చెల్లిస్తూ అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. 279 జీఓ వల్ల కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో పాటు కార్మికులను తొలగించే అవకాశం ఉంటుంది. ప్రధాన రహదారులతో పాటు డ్రైనేజీలను శుభ్రం చేయటానికి ప్రత్యేకంగా పారిశద్ధ్య కార్మికులను నియమిస్తారు. అయితే సాధ్యం కాని నిబంధనలు పెట్టడం వల్ల కాంట్రాక్టర్లు కూడా ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఏదేమైనా జీఓ నెం. 279ను అమలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.