కర్నూల్

యజ్ఞం అనంత పుణ్యఫలం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాలటౌన్, నవంబర్ 14:మనం చేసే ప్రతి పని ఒక యజ్ఞం అని.. పూ ర్వం రాజులు పేరంటం, నామకరణం, పెళ్లి తంతు, యుద్ధాలు చేసినా ఇలా ఏ పనిచేసినా రుషుల ఆధ్వర్యంలో యజ్ఞ హోమాలు చేసిన తరువాతనే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించేవారు. యజ్ఞం ప్రాచీన సంస్కృతి సంప్రదాయబద్దంగా వేద శాస్త్రానుసారం నిర్వహించేది గాయత్రీ మహాయజ్ఞం. యజ్ఞం చేయడం వల్ల అనంత పుణ్యఫలం లభించడమే కాకుండా సర్వ కార్యాల కు యజ్ఞం చేయడం మన ధర్మం. ఎవరైతే నిరంతరం యజ్ఞ హోమాలు చేస్తారో వారి ఇంట లక్ష్మీదేవి తాండవించడమే కాకుండా సుఖశాంతులు, ఆరోగ్యకర జీవితంతో పాటు అన్ని శుభాలు జరుగుతాయని అమరయోగాశ్రమ నిర్వాహకులు, యోగాచార్య అచల పరిపూర్ణ యోగానంద(పాములేటి)స్వామి పేర్కొన్నారు. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని సోమవారం ఆశ్రమంలో 108 యజ్ఞ వేదికలు ఏర్పాటు చేసి భక్తులతో హోమాలు చేయించారు. అనంతరం స్వామీజీ భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ యజ్ఞ హోమాలు చేయడం వల్ల అందరూ ఆరోగ్యవంతులుగా ఉండడమే కాక సుఖశాంతులతో ఉంటారన్నారు. హోమంలో వేసే అనేక రకాల వనమూలికల నుంచి వచ్చే ధూమం గాలిలో కలిసి ఓజోన్ పొరకు రక్షణ కల్పిస్తుందన్నారు. హోమంలో వనమూలికలైన జమ్మి, రావి, తిప్పతీగ, హవ్య ద్రవ్యంతో పాటు అనేక రకాల వనమూలికలు వేస్తారన్నారు. యజ్ఞ వేదిక చుట్టూ ఎవరైతే కూర్చుంటారో వారికి ఆ ధూమం శరీరంలోకి వెళ్లి రోగాలను ఉపశమింపచేసి రోగాల బా రి నుంచి కాపాడుతుందన్నారు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి వస్తున్న హోమాలను ఎవరూ మరిచిపోరాదని, తప్పనిసరిగా అంద రూ తమ ఇళ్లల్లో చేయవచ్చన్నారు. పుట్టువెంట్రుకలు, పెళ్లిళ్లు, సత్యనారాయణస్వామి వ్రతా లు, నామకరణం ఇలా ఎన్నో శుభకార్యాలు చేసే ముందు హోమాలు చేస్తే తప్పకుండా శుభం జరుగుతుందన్నారు. హోమం చేయడానికి స్వల్ప వ్యయం మాత్రమే అవుతుందన్నారు. చాలా ఏళ్లుగా ఆశ్రమంలో ప్రతినెల పౌర్ణమి రోజున హోమాలు చేస్తున్నామని, ఇప్పటి వర కూ దాదాపు 1500 హోమాలు చేసినట్లు తెలిపారు. రాయలసీమలోనే ఎవరూ ఇంతవరకు ఇన్ని హోమాలు చేయలేదన్నారు. అనంతరం ప్రకృతికి హారతి ఇచ్చారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ మన సంస్కృతి, సంప్రదాయాలను వెలుగులోకి తేవడానికి కృషి చేస్తున్నారని, ఇందులో భాగంగా యజ్ఞ హోమాలను కూడా వెలుగులోకి తెచ్చి వాతావరణ కాలుష్యాన్ని తొలగించే మార్గంగా అమలు చేయాలని కోరారు. అప్పుడే స్వచ్ఛ్భారత్‌తో పాటు స్వచ్ఛ గాలి ఉంటుందన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.