కర్నూల్

ఓంకార నామంతో మార్మోగిన మహానంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానంది, నవంబర్ 14:మహానంది పుణ్యక్షేత్రం కార్తీక మాసం మూడో సోమవారం పౌర్ణమి రోజున అశేష జనవాహిని ఓంకారనామంతో మార్మోగింది. శివకేశవులకు ప్రీతికరమైన ఈ మాసంలో పౌర్ణమి సోమవారం కలిసి రావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చా రు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు వేకువజామున 2 గంటల నుంచే స్వామివార్ల దర్శనానికి అనుమతించారు. అర్జిత సేవలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు ఆలయంలోని పుష్కరిణిలలో పుణ్యస్నానం ఆచరించి కార్తీక దీపాలు వెలిగిస్తూ శ్రీకామేశ్వరీ సమేత మహానందీశ్వరుల స్వామివార్లకు అభిషేకార్చన పూజలు నిర్వహించి స్వామివార్లను దర్శించుకున్నారు. ఇఓ శంకరవరప్రసాద్, చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, ధర్మకర్తలు క్షేత్రంలో పర్యవేక్షిస్తు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వందలాది మం ది భక్తులు కార్తీక మాసంలో నిర్వహించే కేదారేశ్వరస్వామి వ్రతాలు నిర్వహించారు. వీరి కోసం ప్రత్యేకంగా అభిషేక మండపంలో వ్రతాలు నిర్వహించుకునేందుకు వసతి కల్పించారు. నంద్యాల డీఎస్పీ హరినాథరెడ్డి, సినీ హాస్యనటులు ఫణి, గోపాలకృష్ణ పూజలు నిర్వహించారు. వీరికి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలుకగా వారు శ్రీ స్వామి అమ్మవార్లకు అభిషేక పూజలు చేశారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు హైదరాబాద్‌కు చెందిన శ్రీశైలంగౌడ్, వెంకటేశంగౌడ్, మహానందికి చెందిన సురేష్, సురేఖ దంపతులు, మండల రెవెన్యూ అధికారులు తహశీల్దార్ రామకృష్ణుడు, వారి సిబ్బంది, బొల్లవరానికి చెందిన రామన్నగౌడ్ అన్నదానం నిర్వహించారు. కాగా మహానందిలో నిత్యాన్న దాన పథకానికి నంద్యాలకు చెందిన విశ్రాంత హెడ్‌మాస్టర్ పుల్లయ్యగౌడ్, సుబ్బమ్మ రూ. 10,116 అందజేసినట్లు ప్రొటోకాల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.