కర్నూల్

భక్తులతో పోటెత్తిన శ్రీశైలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, నవంబర్ 14:కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి ఒకే రోజు రావడంతో ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలం భక్తజనంతో పోటెత్తింది. కార్తీక మాసోత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ లక్ష మందికి పైగా భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారని అంచనా. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు తెల్లవారుజామున 2.30 గంటలకే ఆలయ ద్వారాలు తెరచి ప్రాతఃకాల పూజల అనంతరం భక్తులను అనుమతించారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లలో మజ్జిగ, పాలు, అల్పాహారంగా పులిహోర అందజేసినట్లు ఇఓ నారాయణ భరత్‌గుప్తా తెలిపారు. కార్తీక మాసంలో దీపారాధన ప్రాముఖ్యత దృష్ట్యా భక్తులు దీపారాధన చేసుకునేందుకు వీలుగా ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు శాస్త్రోక్తంగా దీపారాధన చేసి నోములు నోచుకున్నారు. స్వామి వారి దర్శనానికి 5 గంటల సమయం పట్టింది. ఇక పుణ్యనదీ హారతి పురస్కరించుకుని సాయంత్రం పాతాళగంగ వద్ద ప్రత్యేకంగా బోటుపై కళావేదిక ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆలయం ముందుభాగంలోని గంగాధర మండపం వద్ద సంప్రదాయబద్ధంగా జ్వాలా తోరణం కార్యక్రమాన్ని ఆలయ అధికారులు, అర్చక వేదపండితులు నిర్వహించారు.