కర్నూల్

ప్రభుత్వ పథకాల పట్ల రైతులకు అవగాహన కల్పిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, ఏప్రిల్ 22: టిడిపి ప్రభు త్వం రైతులకు ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గ్రామాలలోని రైతులకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తానని మార్కెట్‌యార్డుల చైర్మన్‌ల సంఘం రాష్ట్ర అద్యక్షులు సిద్ధం శివరామ్ తెలిపారు. శుక్రవారం నం ద్యాల మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ విజయవాడ లో నిర్వహించిన రాష్ట్ర మార్కెట్‌యార్డుల చైర్మన్ల సంఘం సర్వసభ్య సమావేశంలో తనను రాష్ట్ర అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 130 మంది మార్కెట్‌యార్డు చైర్మన్ల సమావేశమై తనను చైర్మన్ల సంఘానికి రాష్ట్ర అద్యక్షునిగా ఎన్నుకున్నారన్నారు. ఎన్నిక అనంతరం తనతోపాటు మార్కెట్‌యార్డుల చైర్మన్లు కలసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వినతిపత్రం ఇచ్చామన్నారు. మార్కెట్‌యార్డులను వ్యవసాయ శాఖ అనుబంధ శాఖగా గుర్తించాలని, వ్యవసాయ శాఖ చేపట్టే కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ప్రకారంగా తమను కూడా ఆహ్వానించాలని కోరినట్లు తెలిపారు. మార్కెట్‌యార్డుల చైర్మన్ల సంఘం అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టామని, ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు గ్రామాల్లో రైతుల వద్దకు చేరలేదని, అందుకోసం తాను రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్‌యార్డుల్లో పర్యటించి రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియజేస్తామన్నార. వ్యవసాయ మార్కె ట్ కమిటీల ద్వారా చేపడుతున్న కార్యక్రమాల్లో లింకు రోడ్ల నిర్మాణానికి సిఎం నిధులు మంజూరు చేసేందుకు అంగీకరించినట్లు తెలిపారు. ప్రతి వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఇంకు డు గుంతలు ఏర్పాటు చేయడమేకాక చలివేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. అలాగే రైతుల పొలాల్లో భూసార పరీక్షలు నిర్వహిస్తామని, పశు సంవర్థక శాఖతోకలసి వెటర్నరీ క్యాంపులను ఏర్పాటు చేస్తామన్నారు.