కర్నూల్

సీమకు మహర్దశ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, నవంబర్ 22: రాయలసీమకు దశ తిరిగింది. మూతపడిన పరిశ్రమలు తెరువకపోయినా కొత్త పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారు. దీనివల్ల పరిశ్రలు ఏర్పడి ప్రజలకు ఉపాధి అవకాశాలు మెండుగా కలిగే అవకాశాలు ఏర్పాటు కానున్నాయి. కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో నిత్యం కరవుకాటకాలతో ప్రజలు దుర్భిక్షాన్ని ఎదుర్కొంటూ అహోలక్ష్మణా అంటూ కాలం గడుపుతున్నారు. రాయలసీమ పేపర్‌మిల్లు, కార్బడై ఫ్యాక్టరి, ఆదోనిలోని మూడు స్పిన్నింగ్ మిల్లులు, గుంతకల్లులో ఒకటి, ఎమ్మిగనూరులో ఒకటి స్పిన్నింగ్ మిల్లు, ఎమ్మిగనూరు చేనేత కార్మిక సంఘం, పాల ఉత్పత్తి కేంద్రం, పట్టు పరిశ్రమ కేంద్రాలు ఇలా ఎన్నో పరిశ్రమలు 20 సంవత్సరాలుగా మూతపడ్డాయి. కార్మికులు వీధిన పడగా వర్షాలు లేక రైతులు నష్టపోయి ఇటు కార్మికులు, అటు రైతులు, ప్రజలు వలసబాట పట్టారు. ఇలాంటి సమయంలో ఇప్పటికే ఓర్వకల్లులో సిమెంట్ పరిశ్రమలు స్థాపించడానికి దేశంలోని పారిశ్రామిక దిగ్గజాలు ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఎస్సెల్ జీసీయల్ కన్సార్టీయం సంస్థ రూ.21వేల 300 కోట్లలతో చిత్తూరు జిల్లాలో సౌరఫలకల తయారీ పరిశ్రమ నెలకొల్పనుంది. రూ. 150 కోట్లతో డిక్సన్ టెక్నాలాజీస్ ప్రైవేట్ లిమిటెండ్ కంపెనీ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను నెలకొల్పడానికి ముందుకు వస్తోంది. అనంతపురం జిల్లాలో రూ.180 కోట్లతో గోకుల్ దాస్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థ గార్మెట్ యూనిట్‌ను నెలకొల్పనుంది. చిత్తూరులో రూ.152కోట్లతో టెక్స్‌పోర్ట్ పారిశ్రామిక సంస్థ గార్మెట్ యూనిట్‌ను, చిత్తూరు జిల్లాలో రూ.145 కోట్లతో బ్రిటానియా పారిశ్రామిక సంస్థ బిస్కెట్ల తయారి కంపెనినీ, అదే జిల్లాలో రూ.365 కోట్లతో జైన్ ఇరిగేష్ సిస్టం లిమిటెడ్ ఆధ్వర్యంలో వ్యవసాయ, ఉద్యాన పార్కు ఏర్పాటు చేయనుంది. రూ.5వేల కోట్లతో చిత్తూరు జిల్లాలో వైష్ణవి మేగా ఫుడ్‌ఫార్కు ప్రైవేట్ లిమిటెడ్ ఆహార పార్కును ఏర్పాటు చేయనుంది. యూకేలోని భారతీయ కంపెనీ సోలారాజీస్ ఇండియా సంస్థ కర్నూలు జిల్లాలో 500 ఎకరాల్లో సౌర ఫలకాల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. అనంతపురం జిల్లాలో రూ . 15 వేల కోట్లతో సౌర పార్కు నిర్మాణానికి కూడా ఇదే సంస్థ ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కూడా ఈ సంస్థ ప్రతినిధులు బేటి కావడం జరిగింది. అనంతపురం జిల్లాలో 8వేల ఎకరాల్లో సౌరపార్కు ఏర్పాటు చేస్తారు. ఈ పరిశ్రమ ఏర్పాటు వల్ల నాలుగు వేల మందికి ప్రత్యక్షంగా, 10వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. జయరాజ్ ఇస్పాత్ సంస్థ లిమిటెడ్ రూ.3వేల కోట్లతో ఉక్కు కర్మాగారాన్ని కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలోని గుట్టపాడు గ్రామంలో నిర్మించనున్నారు. ఈ కర్మాగారానికి 1000 ఎకరాల భూమి అవసరం. 2018లో మొదటి దశ నిర్మాణం పూర్తి చేసి ఉక్కు కర్మాగారాన్ని ప్రారంభించేందుకు ఆ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రభుత్వం మొదటి దశకు 370 ఎకరాల భూమిని ప్రభుత్వం అప్పగించనుంది. ఈఫ్యాక్టరీ ఏర్పాటుతో 15వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. పరోక్షంగా కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. ఉక్కు కర్మాగారం రాయలసీమలోనే ఒక ప్రత్యేకతను సంతరించుకోనుంది. ఈవిధంగా రాయలసీమ ప్రాంతానికి భారీ ప్రాజెక్టులు తరలి రానున్నాయి. వీటితోపాటు ప్రభుత్వం కూడా ఆదోని డివిజన్‌లోని బనవాసి వద్ద టెక్స్‌టైల్స్‌ఫార్కు ఏర్పాటు చేయనుంది. కాని కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతాలైన ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో మాత్రం మూడపడిన పరిశ్రమలను తెరిపించకపోవడంపై ప్రజల్లో ప్రభుత్వాలపై అసంతృప్తి ఉంది. ముఖ్యంగా ఆదోని డివిజన్‌లో పత్తిని రైతులు విస్తారంగా పండిస్తారు. ఆదోని వ్యవసాయ మార్కెట్ పత్తి వ్యాపారానికి ప్రసిద్ధి. పత్తి ఆదారిత ఫరిశ్రమైన మూడు స్పిన్నింగ్ మిల్లులు మూతపడ్డాయి. కొత్త స్పిన్నింగ్ మిల్లులను ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాని ఇటు ప్రభుత్వం కాని అటు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావలేదు. కాబట్టి ఆదోని డివిజన్‌లో స్పిన్నింగ్ మిల్లులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం, పారిశ్రామిక వేత్తలు చొరవ చూపితే ఆదోని డివిజన్‌లో కూడా ఉపాధి అవకాశాలు మెరుగైతాయి.
పేదల కష్టాలు తీర్చండి..
* ఎస్‌బిఐ ముందు సిపిఐ ధర్నా
డోన్, నవంబర్ 22:పెద్దనోట్ల రద్దు తో నిరుపేదలు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చాలని డిమాండ్ చేస్తూ మంగళవారం డోన్‌లో సిపిఐ ఆధ్వర్యంలో ఎస్‌బిఐ శాఖ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి రంగనాయుడు, ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు సుంకయ్య మాట్లాడుతూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్య ప్రజలు పడుతున్న బాధలు వర్ణణాతీతమన్నారు. పెద్దనోట్ల రద్దు వల్ల రైతులు, వ్యవసాయ కూలీలు, సామాన్య ప్రజానీకం పనులు మానుకుని గంటల తరబడి బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. మోదీ నల్ల కుబేరుల భరతం పడతామని చెప్పి సామాన్యుల భరతం పడుతున్నారని ఎద్దేవా చేశారు. నల్లధనం వున్న వాళ్లెవరూ క్యూలో వుండడం లేదని, కమీషన్లకు కక్కుర్తిపడి బ్యాంకు అధికారులు నాయకులు, ధనవంతుల ఇళ్ల వద్దకే వెళ్లి కొత్త నోట్లు ఇస్తున్నారని ఆరోపించారు. నోట్ల రద్దు జరిగి పక్షం రోజులు గడిచినా ప్రజల కష్టాలు తీర్చడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఆరోపించారు. ప్రజల కష్టాలు తీర్చేంత వరకూ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సిపిఐ ఆందోళనకు బ్యాంకు వద్దకు వచ్చిన ఖాతాదారులు తోడవడంతో బ్యాంక్ వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. ధర్నాలో నాయకులు లక్ష్మినారాయణ, నాగరాజు, ఏఐవైఎఫ్ కార్యదర్శి పులిశేఖర్, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు అన్వర్, ప్రతాప్‌గౌడ్, రామ్మోహన్, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.