కర్నూల్

రజతోత్సవ వేడుకలు విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానంది, డిసెంబర్ 5:మహానంది వ్యవసాయ కళాశాల రజతోత్సవ వేడుకలను విజయవంతం చేసిన సిబ్బందిని డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డా.రమేష్‌బాబు అభినందించారు. సోమవారం వ్యవసాయ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎకో స్టూడియోను, సమావేశ మందిరంను ఆయన ప్రారంభించారు. నూతన సమావేశ మందిరంలో సిబ్బంది అభినందన సభను ఏర్పాటు చేశారు. అసోసియేట్ డీన్ డా.బాలగురువయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ అభినందన సభలో డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డా.రమేష్‌బాబు, యూనివర్శిటీ అధికారి శ్రీనివాసులు పాల్గొని సిబ్బందిని సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కళాశాలను అంచెలంచెలుగా అభివృద్ధి పరుస్తామని, 2020 నాటికి మహానంది వ్యవసాయ కళాశాలలో పూర్తిస్థాయి అన్ని పిజి విద్యలను ప్రవేశపెడతామన్నారు. కళాశాలకు ఏ వసతులు కావాలన్నా యూనివర్శిటీ సహకారం ఎప్పటికి అందిస్తుంటామన్నారు. పెద్దపండుగ అయిన అగ్రి కార్నివాల్ విజయవంతంగా నిర్వహించిన విద్యార్థులను అభినందించారు. రజతోత్సవ వేడుకలలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండ బోదన, బోదనేతర సిబ్బంది బాగా సహకరించి పూర్తి స్థాయిలో విజయవంతం చేశారన్నారు. వచ్చే మార్చిలో జరుగబోయే బోర్డు సమావేశాన్ని మహానందిలో నిర్వహిస్తామన్నారు. అనంతరం సిబ్బంది నూతన వస్త్రాలను, మోమెంటోలను అందించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డా.ప్రతాపరెడ్డి, డా.రవికుమార్, డా.శ్రీ నివాసులు, డా.శ్రీనివాసరెడ్డి, డా.విజయబాస్కర్‌రెడ్డి, డా.రమేష్, డా.సరోజిని, డా.నిర్మల పాల్గొన్నారు.
నేలలను పరిరక్షించుకోవాలి
బనగానపల్లె, డిసెంబర్ 5:రైతులు నేలతల్లిని నమ్ముకుని వ్యవసాయం చేస్తున్నారని వారు నేలను పరిరక్షించే చర్యలు తీసుకోవాలని బనగానపల్లె వ్యవసాయ మార్కెట్‌యార్డు ఛైర్మన్ కోడి నాగరాజుయాదవ్ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని యాగంటిపల్లె కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రపంచ నేల దినోత్సవాన్ని పురస్కరించుకుని రైతులతో కలిసి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో యార్డు ఛైర్మన్ నాగరాజుయాదవ్ మాట్లాడుతూ రైతులు రసాయనిక ఎరువులు, పురుగు మందులను విచక్షణారహితంగా వాడడం వల్ల నేలలు నిస్సారంగా తయారు అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భూమిలో సారం తగ్గడం వల్ల దిగుబడి తగ్గిపోతుందని అన్నారు. దీనివల్ల రైతులు చేసే వ్యవసాయం లాభసాటిగా లేదని, ఇందుకు రైతులు సేంద్రియ పద్దతులు పాటించి వ్యవసాయం చేయాల్సిన అవసరం వుందన్నారు. రైతులు భూసార పరీక్షలు చేయించుకుని సరియైన పంట, సరియైన ఎరువులు, తగిన మోతాదులో వేయాల్సి ఉంటుందన్నారు. ప్రధాని మోడీ ఆదేశం ప్రకారం ప్రపంచ నేల దినోత్సవాన్ని మనదేశంలో డిశెంబర్ 5న జరుపుకుంటున్నారని తెలిపారు. నేలల్లో బ్యాక్టీరీయాలు వుంటాయన అవి రైతుల నేస్తాలని అన్నారు. మందుల పిచికారితో రైతులకు హానిచేసే కీటకాలతో పాటు రైతులకు మేలుచేసే కీటకాలు, బ్యాక్టీరీయాలు కూడా అంతరించిపోయే ప్రమాదం వుందన్నారు. రైతులు పెట్టుబడులు తగ్గించుకుని, రసాయనిక, పురుగు మందులు క్రమేపి తగ్గించి, సేంద్రియ ఎరువులు వాడుతూ వ్యవసాయం చేయాలన్నారు. ఇందుకువల్ల ప్రజల ఆరోగ్యం కూడా పరిరక్షించబడడమే కాకుండా వారి ఉత్పత్తులకు డిమాండ్ ఏర్పడుతుందని తెలిపారు. అనంతరం రైతులకు యార్డు ఛైర్మన్, శాస్తవ్రేత్తలు నేల ఆరోగ్య పత్రాలు రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి వచ్చిన 300 మంది రైతులు, కెవికె సొసైటీ అకౌంట్స్ మేనేజరు వి నటరాజ, శాస్తవ్రేత్తలు సుధాకర్, బాలరాజు, కెవి రాజేశ్వరరెడ్డి, కె లక్ష్మిప్రియా తదితరులు పాల్గొన్నారు.