కర్నూల్

నకిలీ నోట్ల మార్పిడి ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోనిటౌన్, డిసెంబర్ 5:కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన పెద్దనోట్లు స్థానంలో చిల్లర నోట్లు ఇస్తామని నమ్మించి మోసం చేసిన ముఠాను చాకచౌక్యంగా అరెస్టు చేసినట్లు డిఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 4వ తేదీ ఎమ్మిగనూరు పట్టణంలోని ఆర్టీసి బస్టాండ్‌లో 12వ ప్లాట్‌ఫారం వద్ద నిందితులు డోన్‌కు చెందిన వడ్డే నాగరాజు, నందవరం మండలానికి చెందిన నాయక్‌మహ్మద్‌షరీఫ్, ఎమ్మిగనూరు పట్టణంకు చెందిన షేక్‌అబ్దుల్లా, నయాకాంత్‌తోలను అరెస్టు చేసినట్లు తెలిపారు. అలాగే ఇందులో ఖాదర్ అనే వ్యక్తి పారిపోయినట్లు తెలిపారు. ఎమ్మిగనూరు బస్టాండ్‌లో నిందితులు శివారెడ్డి అనే వ్యక్తికి పాత రూ.500, రూ.1000నోట్లు స్థానంలో రూ.100నోట్లు చిల్లరగా ఇస్తామని నమ్మించి అక్కడికి రప్పించారని అన్నారు. ఆయనకు రూ.100 నోట్లు 20, మిగతావి జిరాక్స్ చేసిన రూ.100నోట్లు 80 కట్టలో పెట్టి ఇచ్చి మోసం చేస్తుండగా ఎమ్మిగనూరు టౌన్ ఎస్‌ఐ, సిబ్బంది దాడి చేసి పట్టుకున్నారని అన్నారు. అనంతరం వారి వద్ద ఉన్న ఆరు సెల్‌పోన్, ఒక ఒరిజినల్ రూ.1000నోటు, రూ.500 ఒరిజినల్ నోట్ల 18 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో 20 అసలు రూ.100 నోట్లు, 80 జిరాక్స్ 100నోట్ల కేసుపై చర్యల కోసం విచారిస్తున్నట్లు తెలిపారు. ఈసమావేశంలో మంత్రాలయం సిఐ, సిబ్బంది పాల్గొన్నారు.

రైతు సంక్షేమం పట్టని ప్రభుత్వం
ఓర్వకల్లు,డిసెంబర్ 5:రైతు సంక్షేమాన్ని తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి విమర్శించారు. మండల పరిదిలోని సోమయాజులపల్లె గ్రామంలో జిల్లా పార్టీ కార్యవర్గసభ్యులు విశే్వశ్వరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన గడప గడపకు వైకాపా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆమె ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేఖ విదానాలను ప్రజలకు వివరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒకవైపు జిల్లాలో కరవు విలయతాండవం చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మండలంలో వ్యవసాయ బోర్లు ఎండిపోయి వర్షాబావ పరిస్థితుల వల్ల కంది, శెనగ, పత్తి, తదితర పంటలు పూర్తిగా దిగుబడిరాని స్థితికి చేరుకున్నాయన్నారు. తీవ్రమైన కరవులో జన చైతన్యయాత్రలు నిర్వహించడం శోచనియమన్నారు. ప్రభుత్వం తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మభ్యపెడుతోందని ద్వజమెత్తారు. గత సంవత్సరం ప్రకటించిన నష్టపరిహారం కూడా ఇంత వరకు రైతులకు అందచేదంటే ముఖ్య మంత్రికి రైతులపై ఎలాంటి అభిప్రాయం వుందోఅర్ధవౌతుందని ఎద్దేవచేశారు. మండలంలో నిర్మిస్తున్న సోలార్ పవర్‌ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రెతులకు కూడా పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందలేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైన స్పందించి కరవు రైతులను ఆదుకోవాలని లేని పక్ష్యంలో భారీ ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో మాజీ ఎంపిపి సంజీవరెడ్డి, గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరమ్మ, మండల వైకాపా అధ్యక్షులు లక్ష్మికాంతారెడ్డి, వైకాపా నేతలు, నాగేశ్వరరెడ్డి, నాగమల్లె, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.