కర్నూల్

వైఎస్ పాలన స్వర్ణయుగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలుసిటీ, డిసెంబర్ 9:ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ పాలన స్వర్ణయుగం లాగా నడిచిందని, అయితే ప్రస్తుత టిడిపి ప్రభుత్వం పేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని వైకాపా రాష్ట్ర కార్యదర్శి బివై రామయ్య విమర్శించారు. వైకాపా జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అధ్యక్షతన శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ వైఎస్ హయాంలో ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్‌మెంట్, ముస్లింల కోసం 4శాతం రిజర్వేషన్, తదితర ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. అయితే ప్రస్తుత టిడిపి ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా పథకాల పేర్లను మార్పు చేశారే కానీ వాటికి నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేస్తున్నారని, దీంతో వేలాది మంది పేద ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆరోగ్యశ్రీకి నిధులు కేటాయించి పేదల ప్రాణాలను కాపాడాలన్నారు. ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ కుయ్ కుయ్ అనే శబ్ధం వినపడేసరికి పేదల ప్రాణాలు లేచి వచ్చేవని, ప్రాణాలను కాపాడేందుకు వైఎస్ 108, 104 వాహనాలను ప్రవేశపెట్టారన్నారు. ఎంత దూ రంలో ఉన్నా 108కు ఒక్క ఫోన్ చేస్తే చాలు వెంటనే వచ్చి రోగులను ఆసుపత్రికి చేర్చి చికిత్స చేయించేవారన్నారు. అలాగే పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించి వారి ప్రాణాలను కాపాడేందుకు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని వివరించారు. అయితే ప్రస్తుతం టిడిపి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకానికి నిధులు కేటాయించకుండా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని దూరం చేయటమే కాకుండా వారి ప్రాణాలకు రక్షణ లేకుండా చేశారని ఆరోపించా రు. ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ సిఎం చంద్రబాబు ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చి పేదలకు సరైన వైద్యం అందకుండా చేస్తున్నారని విమర్శించారు. గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఖచ్చితంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అలాగే మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి హఫీజ్‌ఖాన్ మాట్లాడారు. ధర్నాలో పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం నియోజకవర్గాల ఇన్‌చార్జిలు చెరుకులపాడు నారాయణరెడ్డి, జగన్మోహన్‌రెడ్డి, బుడ్డా శేషిరెడ్డి, నగర కన్వీనర్ నరసింహులుయాదవ్, రాజా విష్ణువర్ధన్‌రెడ్డి, కృష్ణారెడ్డి, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.