కర్నూల్

నోట్ల రద్దుతో చిన్నబోయిన పల్లెలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, డిసెంబర్ 25 : అవినీతి రహిత, నగదు రహిత భారత్ కోసం ప్రధాని మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సంచలనాత్మకం. చారిత్రాత్మకం కూడా. అయితే రోజులు గడిచే కొద్దీ గురితప్పిన వేటగాడి బాణంలా మారటం అనేది ఆందోళన కల్గిస్తున్న అంశంగా చెప్పవచ్చు. రూ. 500, రూ. 1000 నోట్ల రద్దుతో నల్లకుబేరుల గుండెల్లో ప్రకంపనలు రేగే సంగతి అటుంచితే గ్రామీణ ప్రాంతం లో వ్యవసాయ రంగం కుదేలైంది. రైతులు, వ్యవసాయ, వలస కూలీలు, చిల్లర వ్యాపారుల జీవన పోరుకు తీవ్రమైన అడ్డంకిగా ఏర్పడింది. చివరికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నవనాడులు దెబ్బతిని కోలుకోని స్థితిలోకి నెట్టివేయబడింది. నేటికీ దేశ జనాభాలో అధిక శాతం ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న రంగం వ్యవసాయ రంగం. స్థూల జాతీయోత్పత్తిలో వాటా కూడా ఎక్కువగానే ఉంది. ఇప్పటికీ దేశ వ్యాప్తంగా 6లక్షలకు పైగా ఉన్న గ్రా మాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టుగా ఉన్నాయి. ఇతరేతర రంగాలు విఫలమైన సందర్భాల్లో సైతం ఈ దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకున్నది వ్యవసాయ భారతమే. ఈ దేశంలో 90 శాతానికి లావాదేవీలు డబ్బుతోనే కొనసాగుతున్నాయి. ప్రతి పనికి నగదు చేతులు మారటం పరిపాటి. పైగా నగ దు దాచుకోవటం కూడా ఆనవాయితీ. నోటి మాట, విశ్వనీయత మీదనే పనుల నిర్వాహణ జరుగుతుంటుంది. పెద్ద నోట్ల రద్దుతో ఈ పనులన్నీంటికి అవరోధం ఏర్పడింది. బెంగాల్‌లో ఆలు రైతు, కర్నూలులో ఉల్లి రైతు, హైదరాబాద్ పరిసరాల్లో పూలు, పండ్లు, కూరగాయాల రైతులు ఇలా ప్రతి ఒక్కరూ పెద్ద నోట్ల రద్దు బాధితులే. ఎందుకంటే వ్యవసాయంలో రోజువారీ పన్నులన్నిటితో పాటు విత్తనం కొనుగోలు నుంచి ఉత్పత్తి, మార్కెట్‌కు వచ్చే వరకూ ఇమిడి ఉన్న ప్రతి పనిలో నగదు లావాదేవీలు చేతి మారకం ద్వారానే ఉంటాయి. ఇప్పటికి అనేక ప్రాంతాల్లో రైతులు వివిధ పద్ధతుల్లో నిరసన తెలుపుతున్నారు. ఒక్కో ప్రాంతంలో అయితే వారి ఉత్పత్తులను నేల పాలు చేస్తూ తమ వ్యతిరేకతను తెలియజేయటం దేశం నలువైపులా విస్తరిస్తుండటం చూస్తే పరిస్థితి ఏస్థాయిలో ఉందో తెలుస్తుంది. దేశంలో 86శాతం చెలామణిలో ఉన్న రూ. 500, రూ. 1000 నోట్ల రద్దుతో గ్రామీణుల్లో ఒక్కసారిగా చేతిలో చిల్లగవ్వ లేకుండా పోయింది. ఫలితంగా పల్లెలన్నీ చిన్నబోయాయి. దీనికి తోడు ఖరీఫ్ పంట చేతికొచ్చే సమయం. రబీ సాగుకు సన్నద్దమయ్యే కాలం రైతులకు తీరిక దొరకని పరిస్థితి. పెద్దనోట్ల రద్దుతో ఒక్కసారిగా పరిస్థితి తారుమారైంది. పండించిన పంటను కొనే నాథుడు లేడు. ఫలితంగా మార్కెట్ మందగించింది. అయిన కాడికి తెగనమ్మాలన్నా నగదు కొరత. చేతికొచ్చిన పంట నోటి కందకుండా పోతుంది. అదునులో విత్తాల్సిన రబీ పంటలకు సమాయత్తం కాలేక దిక్కుతోచని పరిస్థితి. చేపలు, పాలు, మాంసం, కూరగాయాలు ఉత్పత్తిని చేసే రైతులు, వీటి మీద ఆధారపడి చిల్లర వ్యాపారం చేసుకునే వారి పరిస్థితి దయనీయంగా మారింది. మరొక వైపు పెళ్లిళ్ల సీజన్, శుభకార్యాలు దండిగా, మెండుగా జరుగుతున్న సమయం. వీటిని దృష్టిలో పెట్టుకుని పూల రైతులు కూడా ఢమాలే. మొత్తానికి పెద్ద నోట్ల రద్దు గ్రామీణ భారతాన్ని కోలుకోలేని దెబ్బ తీసిందని చెప్పవచ్చు. నరాలు తెగి జవసత్వాలు కోల్పోయిన పరిస్థితి దాపురించింది. ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉన్న వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆది నుంచి పాలకులకు చిన్నచూపే. మోదీ ఒక్క మాటతో గ్రామీణ భారతం చిన్నబోయింది. కోలుకోవటానికి ఎంత కాలం పడుతుందో తెలియదు. పెద్ద నోట్ల మారకం, కొత్త నోట్ల లభ్యతకు సంబంధించి కూడా గ్రామీణ ప్రాంతాల్లో అరకొర ఏర్పాట్లే. ప్రతి రోజూ పెద్ద, పెద్ద క్యూలైన్లు దర్శనమివ్వటమే ఇందుకు నిదర్శనం. నగదు రహిత అవినీతి సమాజం మంచిదే. అయితే ప్రజలను సంసిద్ధం చేయకుండా ఒక్కసారిగా హఠాత్తుగా మార్పు తీసుకు రావాలనుకోవటం అవివేకం అవుతుంది.
అభివృద్ధి పథంలో అవుకు పంచాయతీ!
* పరిశుభ్రతకు పెద్దపీట..
* పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ కవర్ల నిషేధం..
* పందుల నివారణకు ప్రత్యేక చర్యలు..
అవుకు, డిసెంబర్ 25 : అవుకు పం చాయతీ రోజురోజుకూ అభివృద్ధిలో శరవేగంగా ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు. గ్రామ ప్రజల సౌకర్యాలకు పెద్దపీట వేసిన పంచాయతీ ఆ మేరకు తీర్మానాలు చేసి అమలు చేస్తోంది. ఇప్పటికే అవుకు పట్టణంలో 85 శాతం మేర సిమెంట్ రోడ్లు ఏర్పా టు చేశారు. పారిశుద్ధ్య కార్మికులు ఎప్పటికప్పుడు గ్రామంలో ఉన్న చెత్తను తొలగిస్తుంటా రు. ఎక్కడా బురద ఉండకుండా గ్రామమంతా పరిశుభ్రంగా ఉండేదుకు నిత్యం శ్రమిస్తుంటారు. ప్రధానంగా ప్రజలకు సౌకర్యవంతంగా కూరాగాయలు, మటన్ మార్కెట్ నిర్మించారు. రిజర్వాయర్ గ్రామసమీపంలో ఉండటంతో చేపల మార్కెట్‌పై కూడా దృష్టి సారించారు. ప్రజలకు హాని కలిగించే ప్లాస్టిక్ కవర్ల అమ్మకాలను నిషేధించారు. ఈక్రమంలో వ్యాపారులు కూ డా మేము సైతం అంటూ ముందుకురావడంతో ప్లాస్టిక్ కవర్ల వాడకం గ్రా మంలో పూర్తిగా నిలిచిపోయింది. ఇక గ్రామం లో 20వేల జనాభా ఉండగా అందరికీ పరిశుభ్రమైన తాగునీరు అందించాలన్న సంకల్పంతో పట్టణంలో 5 ప్రధాన ప్రాంతాల్లో శుద్ధ జల కేంద్రా లు ఏర్పాటు చేశారు. అవుకులో బస్టాండ్‌లో దిగి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని వారికి చల్లని తాగునీరు అందించేదుకు బస్టాండ్ వద్ద మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ప్రజల ఆరో గ్యం దృష్ట్యా గ్రామంలో పందులు తిరగకుండా పందుల కాపరులకు తగిన సూచనలు చేయడంతో పాటు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. పందుల కాపరులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం తో గ్రామానికి పందుల నుంచి రక్షణ లభించింది. అవుకులో నిత్యం తాగునీరు అందుబాటులో ఉంటుం ది. దీంతో ఉద్యోగరీత్యా వచ్చిన వాళ్లు కూడా ఇక్కడ స్థిరపడటానికి మొగ్గు చూపుతున్నారు. శ్రీకృష్ణదేవరాయలు కాలంలో నిర్మించిన చెన్నకేశవస్వామి, షిరిడీసాయిబాబా మందిరాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. గ్రామంలో ఎటువంటి అసాంఘిక సంఘటనలు చోటుచేసుకోనకుండా ఓ వైపు పోలీసులు, మరో వైపు గ్రామ నాయకత్వం కృషి చేస్తుంటుంది. అవుకు పట్టణంలో స్నేహపూర్వకమైన పోటీ వ్యాపారం జరుగుతుంది. కోవెలకుంట్ల, బనగానపల్లె కంటే కూడా అవుకులో నిత్యావసర సరుకులు సరసమైన ధరలకు లభిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి సూచనల మేరకే అవుకు గ్రామపంచాయతీ తీర్మానాలు జరుగుంటాయి. చల్లా రామకృష్ణారెడ్డి సోదరుడు చల్లా రాజశేఖరరెడ్డి మండల రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. గ్రామ పంచాయతీ కూడా చల్లా కుటుంబ సభ్యుల పరిపాలనలోనే ఉంటుంది.