కర్నూల్

విద్యుదాఘాతంతో రైతు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దకడబూరు, డిసెంబర్ 26: మండల పరిధిలోని దొడ్డిమేకల గ్రామానికి చెందిన రైతు పెద్దయ్య(28) సోమవారం తెల్లవారు జామున పొలంలో విద్యుదాఘాతంతో మృతి చెందా డు. బంధువులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దొడ్డిమేకల గ్రామానికి చెందిన వెంకటేష్, లక్ష్మీల ఒకే సంతానంగా కూతురు ఉరుకుందమ్మను గుడేకల్ గ్రామానికి చెందిన పెద్దయ్యకు ఇచ్చి ఆరు సంవత్సరాల క్రితం వివాహం చేశారు. వెంకటేష్, లక్ష్మీలకు మగబిడ్డ లేకపోవడంతో పెద్దయ్యను తమ ఇంటి వద్దే పెట్టుకున్నాడు. స్వంత కుమారుడుగా చూసుకుంటూ పొలం బాధ్యతలను అప్పగించారు. గ్రామ శివారుల్లో నాలుగు ఎకరాల్లో బోరు వేసుకుని సాగు చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్‌లో మిరప, పత్తి పంట సాగు చేశారు.పెద్దయ్య సోమవారం తెల్లవారు జామున మిరప నీరు పెట్టేందుకు వెళ్ళి బోరు ఆన్ చేయగా పని చేయకపోవడంతో దగ్గరలో ఉన్నట్రాన్స్‌ఫార్మర్ దగ్గరకు వెళ్లి ఫీజు వేయడానికి ప్రయత్నించాడు. ప్రమాద వశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో పెద్దదయ్య అక్కడిక్కడే మృతి చెందాడు. మామ వెంకటేష్ అల్లుడు ఇంటికి రాలేదని పొలానికి వెళ్ళగా విద్యుత్‌షాక్ ప్రమాదానికి గురై మృతి చెందిన పెద్దయ్యను చూసి బోరున విలపించారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చికత్స పొందుతూ వ్యక్తి మృతి
గోనెగండ్ల, డిసెంబర్ 26: మండలంలోని గంజహళ్ళి గ్రామానికి చెందిన అలిసావు(55) ఆదివారం ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఆసుపత్రికి చేరాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఎస్సీ, ఎస్టీసెల్ డిఎస్‌పి మురళీధర్ తెలిపారు. మృతుని భార్య సుజానమ్మ ప్రవర్తన సరిగా లేకపోవడం వల్ల ఆదే గ్రామానికి చెందిన బోయ శ్రీనివాసులతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలిపారు. దీంతో మనస్థాపానికి చెందిన అలిసావు ఆదివారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుడి మరణ వాంగ్ములం మేరకు బోయ శ్రీనివాసులపై ఎస్సీ, ఎస్టీకేసు నమోదు చేసినట్లు తెలిపారు. రెండు రోజుల్లో నిందితున్ని అరెస్టు చేస్తామని చెప్పారు. సిఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ కృష్ణమూర్తి ఉన్నారు.
రైలుకిందపడి వ్యక్తి మృతి
నంద్యాలటౌన్, డిసెంబర్ 26: నంద్యాల రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని నూనెపల్లె ఓవర్ బ్రిడ్జి కింద రైల్వేట్రాక్‌లో శీలంప్రవీణ్‌రెడ్డి(35) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మద్యంమత్తులో రైలుకింద పడి మృతి చెందాడా లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా అని విచారిస్తున్నట్లు చెప్పారు. ఇతను నూనెపల్లెకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
నలుగురి ఆత్మహత్యాయత్నం
నంద్యాలటౌన్, డిసెంబర్ 26: నంద్యాల పోలీస్ సర్కిల్ పరిధిలోని రెవెన్యూ క్వార్టర్స్‌కు చెందిన సువర్ణ, హరిజనపేటకు చెందిన రాజేశ్వరీ, కానాలకు చెందిన దిల్షాద్, రుద్రవరంకు చెందిన భగవాన్‌లు సోమవారం వివిధ రకాల విషంతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వీరు వివిధ కారణాలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

కారు బోల్తా.. ఆరుగురికి గాయాలు
ఉయ్యాలవాడ, డిసెంబర్ 26: మండలంలోని మాయలూరు సమీపంలో ఆర్‌అండ్‌బి రహదారిపై సోమవారం తెల్లవారుజామున కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులలో ప్రయాణిస్తున్న డ్రైవర్‌తో సహా ఆరుగురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే కడపజిల్లా పులివెందుల పట్టణానికి చెందిన రమేష్, రఘు, ఛాయాదేవి, డ్రైవర్ రెడ్డప్పతో పాటు మరో ఇద్దరు కారులో తెల్లవారు జామున పులివెందుల నుండి బయలుదేరారు. జిల్లాలోని ఆత్మకూరు పట్టణంలో తమ బంధువుల ఇంటిలో జరిగే శ్రీమంతం కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా మాయలూరు వద్ద కల్వర్టు దిమ్మెను కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమీపంలో చలిమంట వేసుకున్న గ్రామస్తుల కళ్ల ఎదుట ప్రమాదం చోటు చేసుకోవడంతో వారు వెంటనే వెళ్లి కారు డోర్లు పగలగొట్టి వారిని బయటకు తీశారు. చికిత్స నిమిత్తం కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు.
బాలిక ఆత్మహత్యాయత్నం
నంద్యాలటౌన్, డిసెంబర్ 26: నంద్యాల మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వేక్వార్టర్స్‌కు చెందిన 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని రాజు అనే ఆకతాయి యువకుడు ప్రతిరోజూ వేధిస్తుండడంతో భరించలేక విషపు మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు సోమవారం ఆకతాయి రాజు బాధితురాలి ఇంటివద్దకు వచ్చి ఆమెతో నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురై విషపు గుళికలు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు చెప్పారు. తండ్రి రవికుమార్ చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆటో బోల్తా.. 9 మందికి గాయాలు
కొలిమిగుండ్ల, డిసెంబర్ 26: మండలంలోని నాయినిపల్లె, కొలిమిగుండ్ల గ్రామాల మధ్య సోమవారం ఆటో బోల్తాపడడంతో 9మంది గాయపడ్డారు. పెట్నికోట గ్రామం నుంచి కొలిమిగుండ్లకు వస్తుండగా గ్రామ సమీపంలో ముందు టైరు పంచర్ కావడంతో అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో అంజనీదేవి, రమాదేవి, సుజాత, జ్యోతిలతో పాటు మరో కొంతమంది మహిళలకు గాయాలయ్యాయి. వీరు ఆసుపత్రిలో చికిత్స పొందారు.
గోర్లగుట్టలో చోరీ
బేతంచెర్ల, డిసెంబర్ 26: మండల పరిధిలోని గోర్లగుట్ట గ్రామంలో సుమిత్రమ్మ ఇంట్లో సోమవారం చోరీ జరిగింది. వివరాలు.. సుమిత్రమ్మ ఈ నెల 23వ తేదీ ఇంటికి తాళం వేసి కొడుకు, కూతురుతో కలిసి తన పుట్టినిల్లు అయిన పలుకూరుకు వెళ్లింది. 26వ తేదీ పలుకూరు నుంచి కుమారుడు కిరణ్‌కుమార్‌గౌడ్ ఇంటికి వచ్చిచూడగా చోరీ జరిగినట్లు గుర్తించాడు. ఇంట్లో ఉన్న నాలుగున్నర తులం బంగారం, రూ. 50వేల నగదు, ఆమె భర్తకు ఆర్మీలో ఇచ్చిన సిల్వర్‌మెడల్‌ను దొంగలు ఎత్తుకెళ్లినట్లు బాధితురాలు సుమిత్రమ్మ ఫిర్యాదులో పేర్కొంది. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీంను రప్పించి దొంగల ఆధారాలను సేకరించారు. అలాగే బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
తల్లిదండ్రులకు బాలుడి అప్పగింత
మహానంది, డిసెంబర్ 26: మహానందిలో ఈనెల 21వ తేదీన తప్పిపోయిన బాలుడిని మహానంది ఎస్‌ఐ పెద్దయ్యనాయుడు బాలుడి తల్లికి అప్పగించారు. సోమవారం ఆయన పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఆళ్ళగడ్డలోని ఏసునగర్‌కు చెందిన పెద్దనర్సక్క బాలుడి తల్లి అని గుర్తించి ఆమెకు మహానంది పోలీస్ స్టేషన్‌లో బాలుడు తల్లి ఒడికి చేరాడు.
కలెక్టర్ వైఖరి శాపంగా మారింది
ఆదోని, డిసెంబర్ 26: జిల్లా కలెక్టర్ ఉద్యోగులు, అధికారులు, ప్రజలు, ప్రజా సంఘాల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని సిపిఎం నాయకులు మహానందరెడ్డి, ఈరన్న, సిఐటియు నాయకులు లక్ష్మన్న, గోపాల్ పేర్కొన్నారు. కలెక్టర్ చర్యలను వ్యతిరేకిస్తూ వేసిన కరపత్రాన్ని సోమవారం సిపిఎం కార్యాలయంలో విడుదల చేశారు.