కర్నూల్

అందరితో కలిసి నడుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, ఏప్రిల్ 24:రాష్ట్భ్రావృద్ధి కోసం అందిరితో కలిసి నడుస్తామని ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి స్పష్టం చేశారు. స్థానిక మార్కెట్ యార్డులో ఆదివారం వెలుగోడు మండలానికి చెందిన రమేష్, సుధాకర్ ఆధ్వర్యంలో దాదాపు 500 మంది టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శిల్పా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ టిడిపిలోకి ఎవరు చేరినా వారితో కలిసి పనిచేస్తామన్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరన్నారు. ఎన్నికల సమయంలో ఘర్షణకు దిగిన కార్యకర్తల మధ్య సర్దుబాటు చేస్తామన్నారు. టిడిపి అందరినీ కలుపుకొని పోతుందన్నారు. రాజకీయాల్లో పార్టీలు మారడం మామూలే అన్నారు. ప్రజలకు ఇష్టం లేకపోయినా రాష్ట్రాన్ని విభజన చేసిన కాంగ్రెస్ పార్టీకి ఆ ప్రజలే రాష్ట్రంలో సమాధి కట్టారన్నారు. వారికి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. బైరెడ్డి రాయలసీమ రాష్ట్రం కోసం పోరాడుతున్నట్లు నాటకం ఆడుతున్నారని విమర్శించారు. ఇక టిడిపి కార్యాలయంపై ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని ఖండించారు. కార్యాలయంలో పనిచేస్తున్న దళిత మహిళపై కూడా దాడి చేయడం దారుణమన్నారు. ఆ దాడి వెనుక ప్రతిపక్ష పార్టీ నాయకుల కుట్ర ఉందన్నారు. చంద్రబాబు హయాంలోనే ఎస్సీలు అభివృద్ధి చెందారన్నారు. టిడిపి ప్రభుత్వంలో మంత్రులు, జిల్లా చైర్మన్, ఎంపిపి వంటి పదవులు పొందారన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో కెడిసిసి బ్యాంకు చైర్మన్ మల్లికార్జునరెడ్డి, నగర పంచాయతీ చైర్మన్ నూర్‌అహమ్మద్, మార్కెట్ యార్డు చైర్మన్ ఆదినారాయణరెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ గోవిందరెడ్డి, లాయర్ గిరిరాజు, తదితరులు పాల్గొన్నారు.