కర్నూల్

పేరులోనే ఆదర్శం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవుకు, డిసెంబర్ 27 : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఆదర్శ పాఠశాలలు, కాలేజీలు ఏర్పాటు కాగా 2013 విద్యా సంవత్సరం నుంచి బోధన ప్రారంభమైంది. ఆయా పాఠశాలల్లో సీటు సాధించాలంటే ప్రవేశ పరీక్షలో నెగాల్సి ఉంటుంది. గురుకులం రెసిడెన్సియల్ తరహా పాఠశాలల మాదిరిగానే ప్రత్యేకమైన శిక్షణతో విద్యాబోధన ఉంటుందని విధ్యర్థులు, వారి తల్లిదండ్రులు భావించారు. ఎలాగైనా ఆదర్శ పాఠశాలల్లో తమ పిల్లలకు సీటు సంపాదించుకోవాలని ఆరాటపడ్డారు. విద్యార్థులు కూడా కోచింగ్ తీసుకుని ప్రవేశపరీక్ష రాసి మంచి ఉత్తీర్ణత సాధించి సీటు దక్కించుకున్నారు. ఈ తతంగం అంతా ఆరంభంలో మాత్రమే జరిగింది. పాఠశాల ప్రారంభమైన కొద్ది నెలలకే పాఠశాల నిర్వహణపై ప్రభుత్వ చిత్తశుద్ధి లోపించింది. దరిమిలా కొందరు తల్లిదండ్రులు తమ విద్యార్థులను అర్ధాంతరంగా విద్యా సంవత్సరం మధ్యలోనే వెనక్కి తీసుకెళ్లిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఆదర్శ పాఠశాలలు మండల కేంద్రానికి 2 నుంచి 5కి.మీ పరిధిలో ఉన్నప్పటికీ విద్యాబోధన ప్రత్యేకంగా ఉంటుందని భావించిన తల్లిదండ్రులు ఆ పాఠశాలలో మొదట్లో చూపించిన ఆసక్తి ప్రస్తుతం చూపించడం లేదంటే అతిశయోక్తి కాదు. ఇక విద్యార్థుల భవిష్యత్తును నిర్ధేశించే ఇంటర్మీడియట్‌కు సంబంధించి ఉండాల్సిన అధ్యాపకులు సగం మంది మాత్రమే ఉండటం, అధ్యాపకులు లేని సజెక్టులలో ఒక సంవత్సరం ఒప్పంద పద్ధతిన అర్హులైన వారిని నియమించి ఎలాగోలా విద్యా సంవత్సరాన్ని పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితులు ఆదర్శ పాఠశాల, కళాశాలల్లో ఉత్పన్నమయ్యాయి. కళాశాలకు సంబంధించి ప్రభుత్వం విద్యార్థుల కోసం 4 గ్రూపులను ప్రవేశపెట్టింది. బైపిసి గ్రూపులో ప్రథమ సంవత్సరం విద్యను అభ్యసించే విద్యార్థులే లేరు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కేవలం నలుగురు ఉన్నారు. ఎంపిసిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 20 మంది ఉండగా, ద్వితీయ సంవత్సరంలో విద్యార్థులే లేరు. సిఇసిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 20 మంది ఉండగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఆరుగురు ఉన్నారు. ఎంఇసి గ్రూపులో అయితే ఒక అడ్మిషన్ కూడా కాకపోవడం గమనార్హం. ఆదర్శ పాఠశాల, కళాశాలలో విద్యనభ్యసించే విద్యార్థుల కోసం కోట్లాది రూపాయల వ్యయంతో ఆధునిక హంగులతో హాస్టల్ వసతి కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వ నిర్లక్ష్యంతో వసతి గృహం నేటికీ ప్రారంభం కాలేదు. ఈ విషయమై ప్రిన్సిపాల్ జి.హరికిషోర్‌ను ప్రశ్నించగా తమకు ప్రభుత్వం నుంచి కానీ ఉన్నతాధికారుల నుంచి కానీ ఎలాంటి గైడ్ లైన్స్ లేవని తేల్చి చెప్పారు. 100 మంది విద్యార్థులకు అవసరమైన వసతి గృహం తయారైందన్నారు. పాఠశాలలో 206 మంది బాలురు, 205 మంది బాలికలు విద్యను అభ్యసిస్తున్నారన్నారు. కళాశాలలో కేవలం 50 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని ప్రిన్సిపాల్ వెల్లడించారు.
నూతన సంవత్సర వేడుకల్లో
హద్దు మీరితే చర్యలు
* ఆకతాయిలకు ఎస్పీ ఆకే రవికృష్ణ హెచ్చరిక
కర్నూలు, డిసెంబర్ 27:నూతన సంవత్సర వేడుకల్లో ఎవరైనా హద్దు మీరితే నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని ఎస్పీ ఆకే.రవికృష్ణ హెచ్చరించారు. వార్షిక తనిఖీలో భాగంగా మంగళవారం ఎస్పీ నగరంలోని కర్నూలు డివిజన్ పోలీసు కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఓరల్ ఎంక్వైరీలు, క్రైం చార్టులు, క్రైమ్ రేటుకు సంబంధించిన సబ్-డివిజన్ ఆఫీసు ఫైళ్లను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడాతూ ప్రాపర్టీ క్రైమ్, చైన్ స్నాచింగ్ నేరాల రేటు తగ్గేవిధంగా చర్యలు చేట్టాలని డీఎస్పీకి సూచించారు. రాత్రి గస్తీల్లో ఈ-బీట్ విధానం అమలయ్యే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజాదర్బార్‌కు వచ్చే ఫిర్యాదులు, గ్రైవ్ క్రైం నేరాలను ఎక్కువ కాలం పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలన్నారు. అలాగే డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఆకతాయిలు పాల్పడే అవాంచనీయ సంఘటనలపై నిఘా ఉంచి సరైన బందోబస్తు ఏర్పాటు చేసే విధంగా సిఐలకు ఆదేశాలు జారీ చేయాలని డీఎస్పీ రమణమూర్తిని ఆదేశించారు.