కర్నూల్

జిల్లా అభివృద్ధికి చేయగలిగినంత చేశా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, డిసెంబర్ 27:తాను జిల్లా అభివృద్ధికి కృషి చేయడం సాధారణ అంశమే అయినా తాను కలెక్టర్‌గా చేయగలిగినంత చేశానని కలెక్టర్ విజయమోహన్ పేర్కొన్నారు. ఫ్యాక్షన్‌ను నిర్మూలించి జిల్లా చరిత్రను తిరగరాశామని, అలాగే జిల్లా అభివృద్ధి సాధించటంలో కృతకృత్యులయ్యానని వెల్లడించారు. కలెక్టరేట్‌లోని సమావేశ భవన్‌లో మంగళవారం పంచాయతీరాజ్ శాఖ కార్యకలాపాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చంద్రన్నబాట కార్యక్రమంలో భాగంగా ఇంజినీర్ల కృషితో జిల్లాలో 650 కి.మీ రోడ్లు వేయడం ద్వారా రాష్ట్రంలోనే జిల్లాను మొదటి స్థానంలో నిలిపి సిఎం మన్ననలు పొందామన్నారు. అలాగే 8 రకా ల పంటల ఉత్పత్తిలో రాష్ట్ర వ్యాప్తంగా 3 పంటల ఉత్పత్తిలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని, పశ్చిమ గోదావరి జిల్లాను సైతం అధిగమించడం గమనార్హమన్నారు. తాను పుట్టిన జిల్లా సస్యశ్యామలంగా ఉండగా కర్నూలు జిల్లా ఫ్యాక్షన్‌తో అభివృద్ధిలో వెనుకబ డి ఉండగా చాలా వ్యథకు గురయ్యాయని, దీంతో చరిత్రను తిరగరాసి జిల్లా అభివృద్ధిని కాంక్షించి పలు అభివృద్ధి పథకాలను విజయవంతంగా అమలు చేశామన్నారు. సర్ ఆర్థర్‌కాటన్, సర్‌థామస్ మన్రో స్ఫూర్తితో జిల్లాలో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయనున్నామన్నారు. మార్చి నాటికి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పూర్తయి 3 పంటలు పండించి ప్రజలు సుఖసంతోషాలతో విలసిల్లాలని కోరుకుంటున్నానన్నారు. రత్నాలు రాసులుగా పోసి అమ్మిన శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి వైభవం తిరిగి వస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అతి శక్తివంతులైన కర్నూలు ప్రజలు ఫ్యాక్షన్ భూతానికి బలికాకుండా స్వశక్తి మీద ఆధారపడితే అభివృద్ధి ఫలాలు అందుకోవచ్చనే ఆలోచనతో, వారిని అభివృద్ధి దిశగా అడుగులు వేయించడంలో విజయం అందుకున్నామన్నారు. పంచాయతీల్లోని అన్ని ఆవాస ప్రాంతాల్లో 90శాతం రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తయిన గ్రామాలను గుర్తించి డిపిఓకు నివేదికలు అందజేయాలన్నారు. పచ్చదనం పెంపొందించడం, ఇంటింటి చెత్తసేకరణ, డంపింగ్, తదితర కార్యక్రమాలను డిపిఓ తన పరిధిలో చేపట్టాలన్నారు. ఆ విధంగా ప్రతి మండలంలో 4 లేక 5 గ్రామాలను పూర్తి చేస్తే స్వచ్ఛ గ్రామాలుగా నిలుస్తాయన్నారు. అలాగే పంచాయతీరాజ్ పనులు పూర్తి చేయటంలో జిల్లా సగటును దాటని మండలాల్లో పనులు వేగవంతం చేసి 15 రోజుల తర్వాత నిర్వహించే సమావేశానికి పూర్తి చేయాలన్నారు. టెండర్ల ప్రక్రియ పెండింగ్ ఉంటే త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రధానంగా పెద్దకడబూరు, తడకనపల్లె, శకునాల, గని, తంగరడోన, ఆలూరు మండలాల్లో చేపట్టిన పనులను, కొత్తపల్లి, పాణ్యం, ఆత్మకూరు, బండిఆత్మకూరు, మహానంది, వెలుగోడు, చాగలమర్రి, రుద్రవరంలోని చెంచుగూడెంలలో సిసి రోడ్లు, మరుగుకాలువల పనులు వంద శాతం పూర్తవ్వాలని ఇంజినీర్లను ఆదేశించారు. నిర్ధేశించిన లక్ష్యాలను నెల లోపు పూర్తి చేయాలని, ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తెస్తే తప్పక పరిష్కరిస్తానన్నారు. పంచాయతీరాజ్ పనులకు సంబంధించి సర్పంచ్ ఆధ్వర్యంలో పనులు చేస్తున్న కూలీలకు జనధన్ ఖాతా ప్రారంభించుట, ఆన్‌లైన్ ద్వారా కూలి సొమ్ము జమ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టాలన్నారు. ప్రతిఒక్కరూ నగదు రహిత లావాదేవీల వైపు మళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్ ఎస్‌ఇ సుబ్బరాయుడు, సిపిఓ ఆనంద్‌నాయక్, డిపిఓ ఆనంద్ పాల్గొన్నారు.
శ్రీశైలంలో వైభవంగా పుష్పార్చన
శ్రీశైలం, డిసెంబర్ 27: శ్రీశైల మహాక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు మార్గశిర మాస శివరాత్రిని పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం స్వామి, అమ్మవార్లకు ఆలయ అధికారులు సాంప్రదాయ బద్ధంగా విశేష పుష్పార్చనను నిర్వహించారు. లోక కల్యాణం కోసం జరిపించే ఈ విశేష కార్యక్రమంలో స్వామి, అమ్మవార్లకు 22 రకాల పూలను సమర్పించి సాంప్రదాయ బద్ధంగా పుష్పార్చన సేవను ఆలయ అర్చక వేదపండితులు నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు సమర్పించే పుష్పాలను ఆలయ ప్రదక్షిణ చేశారు. నాగులకట్ట వద్ద ఏర్పాటు చేసిన కళా వేదికపై స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పూజా సంకల్పం, గణపతిపూజ, అనంతరం పుష్పాలతో షోడోపచారాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి 11రకాల హారతులతో స్వామి, అమ్మవార్లను విశేషంగా పూజించారు. ఇందులో భాగంగా ప్రముఖ పండితులతో ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని ఏర్పాటు చేశారు. పుష్పార్చన సందర్భంగా వేణుగానం, నాదాస్వర కచేరి భక్తులను ఎంతో అలరించాయి. ఈ కార్యక్రమంలో ఇఓ నారాయణభరత్ గుప్త దంపతులు, జెఇఓ హరినాథరెడ్డి, ఆలయ అర్చక వేదపండితులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.