కర్నూల్

గ్రామాభివృద్ధికి సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఏప్రిల్ 24: గ్రామ వికాసంపైనే దేశ వికాసం, అభివృద్ధి ఆధారపడి వుంటాయని, కావున ప్రతిఒక్కరూ తోడ్పాటు, సహకారం అందించాలని కలెక్టర్ విజయమోహన్ పిలుపునిచ్చారు. కల్లూరు మండల పరిధిలోని పెద్దపాడు గ్రామంలో ఆదివారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు అతి చేరువలో వున్న స్థానిక ప్రభుత్వాలే పంచాయతీ రాజ్ సంస్థలని, స్థానిక ప్రభుత్వాలు ప్రజల అవసరాలను గుర్తించి ఆ అవసరాలను తీర్చడంలో ప్రముఖ పాత్ర వహించారన్నారు. ప్రజల భాగస్వామ్యంతో అన్ని గ్రామ పంచాయతీల్లో సమగ్ర గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి అభివృద్ధి పరచాలన్నారు. చెట్లు వుంటేనే మానవ మనుగడ వుంటుందని, కావున ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, అందుకు ప్రభుత్వం డబ్బులు కూడా ఇస్తుందన్నారు. గ్రామంలో రైతు సంఘాల ఏర్పాటుకు రైతులు ముందుకువచ్చి మీ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. గ్రామంలో 500 మంది రైతులు వుండగా 50 మంది మాత్రమే ముందుకు వచ్చినట్లు తెలుస్తోందని, గ్రామ ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే అంద రూ సమన్వయంతో వుండి గ్రామాభివృద్ధికి తోడ్పడాలన్నారు. గ్రామంలో ఫారంపాండ్లు, చెక్‌డ్యాంలు, నీటి ట్యాంకులు నిర్మించుకుంటే వేసవిలో నీటికి ఇబ్బందులు ఉండవన్నారు. ఈ గ్రామం ఓడిఎఫ్ గ్రామంగా వుందని, గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో వెనుకబడి వున్నారని, ఇంకా నిర్మించుకోని వారు వెంటనే నిర్మాణానికి ముందుకు రావాలన్నారు. త్వరలో పెద్దపాడు గ్రామం అభివృద్ధి చెందుతుందని, పని చేయని అధికారులపై తప్పక చర్యలు తీసుకుంటానన్నారు. ఈ నెల 27వ తేదీ మళ్లీ గ్రామానికి వస్తానని ఆ సమయంలో అధికారులందరూ వుండి చేసిన పనులు చెప్పాలని, అలాగే గ్రామ ప్రజలందరూ హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతకుముందు గ్రామస్థులు పెద్దపాడు గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంలో, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, బిల్లులు తదితర సమస్యలపై అధికారులు స్పందించడం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఆయా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్త వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని తెలిపారు. గ్రామసభలో జెడ్పీ సిఇఓ ఈశ్వర్, డిపిఓ స్వరూపారాణి, పిఆర్ ఎస్‌ఇ సురేంద్రనాథ్, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ, ఎంపిడిఓ, తహశీల్దార్, తదితరులు పాల్గొన్నారు.