కర్నూల్

జన్మభూమితోనే సమస్యల పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలిమిగుండ్ల, జనవరి 3: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన జన్మభూమి కార్యక్రమం వల్ల ప్రజల సమస్యలు సత్వర పరిష్కారం అవుతున్నాయని ఎమ్మెల్యే బిసి జనార్థన్‌రెడ్డి అన్నారు. మండలంలోని కొండమీదపల్లె, గొర్విమానుపల్లె గ్రామాల్లో మంగళవారం జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఎమ్మెల్యే, జిల్లా విద్యాశాఖ అధికారి రవీంద్రనాథ్‌రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈసందర్బంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, మరికొన్ని వాటికి ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ జయరామిరెడ్డి, ఎంపిడిఓ విజయబాస్కర్, ఎంఇఓ కంబయ్య, ఎంఎఓ సురేష్‌రెడ్డి, ఆర్‌ఐ రామచంద్రరావు, ఎపిఓ గంగన్న, ఎపిఎంఓ లింగమయ్య, మండల ఉపాధ్యక్షులు పులి ప్రకాష్‌రెడ్డి, సర్పంచు రామాంజనేయులు, మండల టిడిపి అధ్యక్షులు రామేశ్వరరెడ్డి, జిల్లా కార్యదర్శి నంద్యాల రామేశ్వరరెడ్డి, పక్కిరారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కార వేదిక జన్మభూమి
* ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి
నంద్యాల, జనవరి 3: పట్టణాల్లో గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కార వేదికగా జన్మభూమి - మా ఊరు కార్యక్రమం నిలుస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం 4వ విడత జన్మభూమి కార్యక్రమాన్ని ప్రారంభించిదని ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని 6,7 వార్డులకు గాను ఎన్‌టిఆర్ షాధిఖానాలో జన్మభూమి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మున్సిపల్ చైర్‌పర్సన్ దేశం సులోచన, కమిషనర్ సత్యనారాయణరావు, తహశీల్దార్ శివరామిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సిఎం చంద్రబాబునాయుడు రాష్ట్భ్రావృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. అనంతరం సంక్రాం తి కానుకగా చంద్రన్న కానుకలు అందజేశారు. జన్మభూమి కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ సిడిపివో ఆగ్నేస్ ఏంజెల్, 5వ వార్డు కౌన్సిలర్ మహబూబ్‌చాంద్‌బీ, 6వ వార్డు కౌన్సిలర్ భీమునిపల్లె వెంకటసుబ్బయ్య, అధికారులు పాల్గొన్నారు.