కర్నూల్

సీమకు సాగునీటిపై చట్టబద్ధత కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బనగానపల్లె, జనవరి 3:రాయలసీమకు సాగునీటిపై రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధతను కల్పించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్ బొజ్జా దశరథరామిరెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని శ్రీఆంజనేయస్వామి ఆలయంలో ఉన్న కల్యాణం మండపంలో మంగళవారం రైతు సంఘం నేత దొనపాటి యాగంటిరెడ్డి, జిల్లెల్ల శివరామిరెడ్డి, ఎ.రామచంద్రారెడ్డి, వైఎన్ రెడ్డి తదితరులతో కలిసి రైతుల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బొజ్జా, యాగంటిరెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది కృష్ణానదికి ఎగువన వర్షాలు సమృద్ధిగా కురవడంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండిందని తద్వారా కెసి, తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బిసి, హంద్రీనీవా కాలువలకు నీరు వదిలారని తెలిపారు. అయితే రైతుల్లో ఒకవైపు సంతోషం మరోవైపు ఆందోళన కల్గుతుందన్నారు. ఈ నీరు ఎంతకాలం వస్తుంది.. భవిష్యత్తులో ఇది సాధ్యమా.. మననీరు మనం సాధించుకోగలమా.. తదితర ప్రశ్నలు సీమ వాసుల్లో తలెత్తుతున్నాయన్నారు. కావున వారిలో మనోధైర్యం, నమ్మకం కల్గించేందుకు సీమకు సాగునీటిపై చట్టబద్ధత చేయాల్సిన అవసరం వుందన్నారు. సిఎం చంద్రబాబు రాయలసీమ వ్యక్తి కావున ఇప్పుడే చట్టబద్ధత చేయాలని, కోస్తా ప్రాంతానికి చెందిన వారు సిఎం అయితే సీమకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
అలాగే శ్రీశైలం దిగువకు నీరు వదిలేందుకు జీఓ 69 తీసుకువచ్చి 834 అడుగుల వరకూ దిగువకు నీరు వదిలేందుకు నిర్ణయించడం వల్ల రాయలసీమకు నీటి లభ్యతపై అనుమానాలు, ఆందోళనలు కల్గుతున్నాయన్నారు. ఇందుకు కెసి, తుంగభద్ర ఎగువ, దిగువ కాలువలు, ఎస్‌ఆర్‌బిసి, బైరవానితిప్ప, గాజులదినె్న ప్రాజెక్టుల నిర్ధేశిత ఆయకట్టులో సగానికి పైగా నీరు పారని ఆయకట్టు స్థిరీకరణకై గుండ్రేవుల నిర్మాణం, ఎగువ సమాంతర కాలువ, వేదావతిపై ఎత్తిపోతల పథకం, గురురాఘవేంద్ర ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. పట్టిసీమ ద్వారా మిగిలిన 45 టిఎంసిలు, చింతలపూడి ద్వారా లభించే 32 టిఎంసిలు, పులిచింతల ద్వారా అదనంగా వచ్చే 54 టిఎంసిలు, శ్రీశైలం ప్రాజెక్టుకు కేటాయించిన క్యారీ ఓవర్ 60 టిఎంసిలతో కలిపి మొత్తం 191 టిఎంసిలపై చట్టబద్ధతను రాలయసీమ ప్రాంతానికి కల్పించాలన్నారు. ప్రస్తుతం సిద్దేశ్వరం అలుగు సాధనకై సీమ రైతులు చేస్తున్న ఆందోళన దేశవ్యాప్తంగా తెలిసిందన్నారు. అయితే ఈ ప్రభుత్వం ఉద్యమకారులపై అక్రమ కేసులు బనాయించి బెదిరింపులకు దిగుతుందని మండిపడ్డారు. పట్టిసీమ, పోలవరం నిర్మించినా సీమకు నీరు అందాలంటే 854 అడుగులు నీరు శ్రీశైలంలో వుంచితే సీమకు న్యాయం జరుగుతుందని తెలిపారు. సాగునీటి విషయంలో సీమకు న్యాయం జరిగేంత వరకూ తాము ఉద్యమం ద్వారా ప్రభుత్వంపై వత్తిడి తెస్తూనే ఉంటామన్నారు. సదస్సులో నియోజకవర్గం పరిధిలోని వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

ఈరన్నస్వామి సేవలో
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్
కౌతాళం, జనవరి 3: కౌతాళంలో ప్రసిద్ధి చెందిన ఉరుకుంద ఈరన్నస్వామిని మంగళవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి పూలమాలతో సన్మానించారు. అనంతరం స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ప్రసాదాన్ని అందించారు. ఈసందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయట్రస్టు బోర్డు చైర్మన్ చెన్నబసప్ప, ఆలయ అధికారి వెంకటేశ్వర్లులతోపాటు ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.