అంతర్జాతీయం

పూల్వామా దాడిపై జైషేతో సంప్రదించాం:ఖురేషీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్: పూల్వామా దాడిపై జైషే సంస్థతో సంప్రదించామని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖురేషీ తెలిపారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాము ఈ దాడులకు పాల్పడలేదని జేషే సంస్థ తెలిపిందని ఆయన అన్నారు. భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై స్పందిస్తూపాక్ శాంతిని కోరుకుంటుందని అన్నారు. కాగా పూల్వామా దాడికి పాల్పడింది తామేనని, 40 మంది జవాన్ల మృతికి తామే కారకులమని స్వయంగా జేషే సంస్థ ప్రకటించిన విషయం విదితమే. కాగా జేషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత, భారత్‌లో పలు దాడులకు కారకుడైన మసూద్ అజార్ పాక్‌లోనే ఉన్నాడని పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ నిన్న అంగీకరించిన విషయం విదితమే. ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడు. బయటకు కదలలేని స్థితిలో ఉన్నాడు. మసూద్‌ను అరెస్టు చేయాలంటే ముందు తగిన ఆధారాలు ఉన్నట్లు భారత్ చూపించగలిగితే చర్యలు తీసుకుంటామని ఖురేషీ తెలిపారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని కూడా ఆయన నిన్న అన్నారు.