ఆంధ్రప్రదేశ్‌

అమలుకు నోచుకోని సిఎం హామీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* నిరాశలో కర్నూలు వాసులు
కర్నూలు, మార్చి 11: కర్నూలు నగరం, జిల్లా అభివృద్ధిపై గతంలో పలుమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవటం లేదు. దీంతో స్థానికుల్లో నైరాశ్యం అలుముకుంటోంది. రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర స్థాయిలో కర్నూలు నగరంలో నిర్వహించారు. ఆ కార్యక్రమంలో సిఎం చంద్రబాబు చాలా హామీలు ఇచ్చారు. అయితే అన్నీ కాకపోయినా వాటిలో ప్రధానమైన రెండు, మూడైనా అమలు చేసిఉంటే జిల్లాకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అప్పట్లో స్థానికులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కర్నూలు నగరాన్ని రాజధానిగా ఎంపిక చేయలేకపోయినా అభివృద్ధిలో మాత్రం దూసకెళ్లేలా చేస్తానని జిల్లా పర్యటనల్లో పలుమార్లు ముఖ్యమంత్రి హామీలు ఇచ్చారు. కర్నూలు నగరాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్మార్ట్ సిటీగా మారుస్తామని ఇచ్చిన హామీ అటకెక్కింది. తాజా బడ్జెట్‌లో కర్నూలును సుందర నగరంగా మారుస్తామని ప్రస్తావించారే కానీ నిధుల కేటాయింపు మాటే ఎత్తలేదు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టుకు, కెసి కాలువకు తక్కువ మొత్తంలో నిధులు కేటాయించారు. గుండ్రేవుల జలాశయ నిర్మాణం, హగరి (వేదావతి) నదిపై ఎత్తిపోతల పథకం ఊసే ఎత్తకపోవడం విస్మయం కలిగించింది. ఓర్వకల్లు పారిశ్రామికవాడ విషయాన్ని పక్కన పెట్టి కొత్తగా ప్రకాశం జిల్లా దొనకొండ పేరును చేర్చడంపైనా అసంతృప్తి వ్యక్తమవుతోంది.