అక్షర

మహాకవి శ్రీశ్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు కవిత (సంకలనం)
సంపాదకులు
డా.యం.జయరాం * కలం ప్రహ్లాద్
వెల: రూ.80/-
ప్రతులకు: కలం ప్రహ్లాద్
యం.ఐ.జి. 263, ఎపిహెచ్‌బి కాలనీ
ఆదోని - 518 301
కర్నూలు జిల్లా.
99853 55456

కర్నూలు సీమలోనే శ్రీశ్రీ మహాకవి అయ్యారు. 50వ దశకంలో నంద్యాలలో జరిగిన ఎన్నికల సభలో కమ్యూనిస్టు నేత కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు శ్రీశ్రీని మహాకవి అని సంబోధించారు. కర్నూలు జిల్లాకు చెందిన ఒకానొక సాహిత్య చారిత్రకాంశమిది. తెలుగు లోగిళ్లకు విద్యుత్ కాంతుల నందిస్తున్న కర్నూలు సీమ ఈ కవితా సంకలనం ద్వారా విద్వత్ కాంతుల నందిస్తుంది. ఆధ్యాత్మిక క్షేత్రనిధి అయిన కర్నూలు సీమ ఇప్పుడు ఆధునిక సాహిత్య కేంద్రంగా రూపు దిద్దుకొంటుందనడానికి ఈ సంకలనం ఒక ఆనవాలు. ఈ సంకలనంలోని కవితలలో పల్లె నుంచి ప్రాపంచిక అంశాల దాకా ప్రస్తావనలున్నాయి. వైవిధ్య భరితమైన కవితలున్నాయి. ఇందులోని కవితలు గాడి తప్పుతున్న రాజకీయాల్ని ఎత్తి చూపుతున్నాయి. వదులౌతున్న మానవ సంబంధాలను పటిష్టం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అనేక రకాలుగా దోపిడీని ఎత్తి చూపుతున్నాయి. విడిపోతున్న జనాన్ని కలపడానికి ప్రయత్నిస్తున్నాయి. వర్తమానం పట్ల ఎంత అసంతృప్తి ఉన్నా ఈ కవులు ఎవరూ నిరాశావాదులు కాకపోవడం గమనించాల్సిన అంశం.