ఆటాపోటీ

కుస్తీకి కొత్త రూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చారిత్రక ప్రాధాన్యం ఉన్న క్రీడల్లో మల్ల యుద్ధం ఒకటి. రెజ్లింగ్‌గా నేడు అంతర్జాతీయ క్రీడగా వెలుగుతున్నప్పటికీ, దీని మూలాలు పలు దేశాల ఇతిహాసాల్లో కనిపిస్తాయ. మల్ల యుద్ధానికి మన దేశంలో ఎంతో ఆదరణ ఉంది.
==============
అత్యంత పురాతన క్రీడల్లో ఒకటైన కుస్తీ కొత్త రూపాన్ని సంతరించుకుంది. ప్రొఫెషనల్ రెజ్లింగ్ లీగ్ (పిడబ్ల్యుఎల్) రాకతో మన దేశంలోనూ రెజ్లింగ్ ఒక వృత్తిగా మారనుంది. పురాతన కాలంలో కుస్తీ ఒక హాబీ. ఆరోగ్యంగా ఉండేందుకు చాలామంది ఎంచుకునే మార్గం. తర్వాతి కాలంలో కుస్తీ ఒక వృత్తిగా మారింది. ఫలితంగా మల్ల యోధులు పుట్టుకొచ్చారు. పురాణాల్లో ఈ క్రీడకు సంబంధించిన ఎన్నో గాధలు కనిపిస్తాయి. నియమ నిబంధనల్లో కొన్ని మార్పులు చేసి ప్రొఫెషనల్ క్రీడగా రూపాంతరం చెందినప్పటికీ, చాలా వరకు మూల సూత్రాలు మారలేదు. ఇప్పటికీ సంప్రదాయ విధానాల్లోనే కొనసాగుతున్న క్రీడ ఇది. వినోదం పేరుతో వివిధ రూపాల్లో కొత్త పుంతలు తొక్కుతున్న రెజ్లింగ్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది. పురాణ, ఇతిహాసాల్లోనూ కుస్తీకి సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలు కనిపిస్తాయి. మల్లయోధులకు ప్రత్యేక గుర్తింపు ఉండేది. రాజులు ప్రత్యేకంగా కుస్తీ వీరులను పెంచిపోషించేవారు. ఒక రాజ్య సంపదను, కీర్తిని అక్కడ ఉన్న మల్లయోధుల సంఖ్యను, వారు సాధించిన విజయాలను బట్టి నిర్ణయించే ఆనవాయితీ కూడా అమల్లో ఉండేది. ప్రతి గ్రామంలోనూ కుస్తీ కోసం గోదా తప్పనిసరిగా ఉండాల్సిందే. ఒకప్పుడు విపరీతమైన ఆదరణ ఉంది కాబట్టే ఎంతో మంది మోధులు మల్ల యుద్ధాన్ని వృత్తిగా స్వీకరించి, పేరుప్రఖ్యాతులతోపాటు డబ్బును కూడా బాగానే ఆర్జించారు. క్రమంగా గ్రామాలు కూడా పట్టణ పోకడలను అనుసరించడంతో కుస్తీ వీరులు ఉపాధి కోల్పోయారు. బతుకు తెరువుకోసం ఎన్నో పనులు చేశారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ అలాంటి పరిస్థితే ఉంది. పిడబ్ల్యుఎల్ ఆవిర్భావంతో దేశంలో రెజ్లింగ్‌కు మళ్లీ పూర్వవైభవం రావడం ఖాయం.
బరిలో ఆరు జట్లు
వచ్చేనెల 10 నుంచి 27వ తేదీ వరకు జరిగే పిడబ్ల్యుఎల్‌లో ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఒక్కో జట్టుకు ఒక్కో కేంద్రం ఉంది. ఢిల్లీ వీర్, సిడిఆర్ పంజాబ్ రాయల్స్, హర్యానా హ్యామర్స్, యుపి వారియర్స్, ముంబయిచే గరుడే, బెంగళూరు యోధాస్ పేర్లతో ఆరు ఫ్రాంచైజీలు ఏర్పడ్డాయి. ఢిల్లీ వీర్ జట్టుకు ఢిల్లీలోని కెడి జాదవ్ స్టేడియం, పంజాబ్ రాయల్స్‌కు లూథియానాలోని గురునానక్ ఇండోర్ స్టేడియం, హర్యానా హ్యామర్స్‌కు గుర్గావ్‌లోని హయత్ రెజెన్సీ, యుపి వారియర్స్‌కు నోయిడాలోని గౌతం బుద్ధ యూనివర్శిటీ ఏకలవ్య కాంప్లెక్స్, ముంబయిచే గరుడేకు ముంబయిలోని రిలయన్స్ స్టూడియో, బెంగళూరు యోధాస్‌కు బెంగళూరులోని కొరమంగళ స్టేడియం కేంద్రాలుగా ఖరారయ్యాయి. డిసెంబర్ 10 నుంచి మొదలయ్యే ఈ పోటీల్లో మొత్తం 18 బౌట్స్ ఉంటాయి. గ్రూప్ దశలో 15కాగా, రెండు సెమీ ఫైనల్స్, ఒక ఫైనల్ అభిమానులకు కనువిందు చేయనున్నాయి. మొత్తం ఈవెంట్ ఖర్చు 20 కోట్ల రూపాయలు. ప్రైజ్‌మనీ 5 కోట్లు. ఒక్కో జట్టు నుంచి పది మంది చొప్పున ఆరు జట్ల నుంచి 60 మంది రెజ్లర్లు పోటీపడేందుకు సిద్ధంగా ఉంటారు. వీరిలో 30 మంది అంతర్జాతీయ, మరో 30 మంది స్థానిక రెజ్లర్లు. ఒక్కో జట్టులో ఐదుకు మించకుండా విదేశీ రెజ్లర్లు ఉండవచ్చు. ప్రతి జట్టులోనూ పది మందిలో ఐదుగురు పురుషులు, మరో ఐదుగురు మహిళలు కావడం విశేషం.
భారీ ధర
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)తో మన దేశంలో మొట్టమొదటిసారి క్రీడాకారులకు వేలం, అమ్మకం మొదలయ్యాయి. బాడ్మింటన్ లీగ్, టెన్నిస్ లీగ్, ఫుట్‌బాల్ లీగ్, ప్రో కబడ్డీ అడుగుజాడల్లో నడుస్తూ పిడబ్ల్యుఎల్‌లోనూ వేలం జోరుగా సాగింది. ఎవరూ ఊహించనంత భారీ ధరలను రెజ్లర్లు దక్కించుకున్నారు. హర్యానా ఫ్రాంచైజీ ఒక్సానా హెర్తెల్‌కు ఏకంగా 41.30 లక్షల రూపాయలు చెల్లించింది. ఉక్రెయిన్‌కు చెందిన ఈ మహిళా రెజ్లర్‌కు వేలంలో అందరి కంటే ఎక్కువ మొత్తం దక్కడం విచిత్రం. భారీ ధర లభించిన రెజ్లర్ల జాబితాలో రెండో స్థానం కూడా ఒక మహిళే దక్కించుకోవడం విశేషం. బెలారస్‌కు చెందిన వసిలిసా మర్జాలియక్ కోసం పంజాబ్ ఫ్రాంచైజీ 40.2 లక్షల రూపాయలు వెచ్చించింది. ఈ జాబితాలో మూడవ, పురుషుల్లో మొదటి స్థానం భారత రెజ్లర్, లండన్ ఒలింపిక్స్ పతక గ్రహీత యోగేశ్వర్ దత్ సొంతం చేసుకున్నాడు. అతనికి హర్యానా ఫ్రాంచైజీ 39.70 లక్షల రూపాయలు చెల్లించింది. రష్యా రెజ్లర్ యెసిలిర్మక్‌ను ఢిల్లీ జట్టు 39.6 లక్షలకు తీసుకుంది. భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ 38.20 లక్షల రూపాయలతో ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు.
ఎంత భారీ ధరల లభిస్తే బాధ్యతలు అంత ఎక్కువ గా పెరుగుతాయన్నది వాస్తవం. మన దేశంలో కుస్తీకి ద క్షిణ భారతంతో పోలిస్తే ఉత్తర భారత దేశంలోనే ఆదర ణ ఎక్కువ. అక్కడి నుంచి వచ్చిన వారు చాలామంది అంతర్జాతీయ రెజ్లింగ్‌లో పేరు ప్రఖ్యాతులు సంపాదిం చారు. మల్ల యుద్ధంలో భారత దేశానికి కీరిత్రపతిష్టలను ఆర్జించి పెట్టారు. మంగోలియా, చైనా, కొరియా, రష్యా వంటి దేశాల నుంచి ఎంతో మంది మల్లయుద్ధ వీరులు మెరుస్తున్నప్పటికీ, సంప్రదాయ క్రీడ ఇప్పటికీ మన దే శంలో మాత్రమే చూడగలుగుతాం. ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉన్న రెజ్లింగ్‌కు ప్రో రెజ్లింగ్‌తో కొత్త రూపం వచ్చింది. సరికొత్త విధానాలను అనుసరిస్తూ, మల్ల యు ద్ధాన్ని ప్రొఫెషనల్ క్రీడగా మార్చుకునే అవకాశం ఏర్ప డుతుంది. సగానికి సగం మంది రెజ్లర్లు భారతీయులే ఉండాలని ప్రతి ఫ్రాంచైజీకి నిర్వాహకులు స్పష్టమైన ఆ దేశాలు జారీ చేశారు. దీనితో, ప్రొ రెజ్లింగ్‌లో పోటీపడే అవకాశంతోపాటు అంతర్జాతీయ రెజ్లర్లతో కుస్తీ గోదా లోకి దిగడం ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకోవడానికి అ వకాశం ఏర్పడుతుంది. మూలాలను విస్మరించకుండా, కుస్తీకి కొత్త రూపం వస్తే తప్పులేదు. ఒక రకంగా ఇది ఆహ్వానించతగ్గ పరిణామమే.

- ఎస్‌ఎంఎస్