జాతీయ వార్తలు

కాంక్రీట్ జంగిల్‌గా అమరావతిని మార్చొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనాలోచితంగా పర్యావరణ అనుమతులు
ముంపు ప్రాంతాలతో ముప్పు
ఎంపి కెవిపి ఆందోళన
కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్‌కు లేఖ

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: అమరావతిలో ఏర్పాటు కానున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి పర్యావరణ అనుమతులు మంజూరు చేయటానికి ముందు కీలక అంశాలపై దృష్టి సారించకపోవటం వల్ల భవిష్యత్తులో ఇప్పుడు తమిళనాడు, గతంలో ఉత్తరాఖంఢ్ రాష్ట్రాలను సర్వనాశనం చేసిన పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావుకేంద్రాన్ని హెచ్చరించారు. అమరావతిలో రాజధాని నిర్మాణం వల్ల 1500 ఎకరాల భూమి ముంపునకు గురి అవుతుందని క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రకటించింది. రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు, పరిశ్రమల నిర్మాణం, గృహ సముదాయాల నిర్మాణానికి తాత్కాలిక అనుమతిని ఇచ్చినట్లు పర్యావరణ కమిటీ తెలియచేసింది. అయితే ఏ ప్రాంతంలో వేటిని నిర్మించాలలో నిర్ధారించకుండా పర్యావరణ కమిటీ అనుమతి ఎలా ఇచ్చిందని ఆయన కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జావడెకర్‌కు రాసిన లేఖలోప్రశ్నించారు. నిజానికి కొత్త రాజధాని నిర్మాణానికి సంబంధించిన వివిధ అంశాలపై కేవీపీ వేసిన ప్రశ్న రాజ్యసభలో వివిధ కారణాల వల్ల రాకపోవటంతో ఆయన జావడెకర్‌కు లేఖ రాశారు. నిర్మాణాల వల్ల అమరావతి ఒక కాంక్రీట్ ప్రాంతంగా మారిపోతుందని ఆయన చెప్పారు. 1500 ఎకరాల భూమి కొండ వాగు వల్ల ముంపునకు గురి అవుతున్న నేపథ్యంలో పక్కనే ఉన్న కృష్ణానదికి భారీ వర్షాలు వరదలు వచ్చినప్పుడు తమిళనాడు, ఉత్తరాఖండ్‌లకు పట్టిన గతే మనకు పడుతుందన్న భయాన్ని వ్యక్తం చేస్తూ ఈ అంశాన్ని పర్యవరణ శాఖ పరిగణనలోకి తీసుకుందా? అని ఆయన ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి 33వేల ఎకరాల భూమిని సేకరించిన ప్రభుత్వం 450 హెక్టార్ల అటవీ భూములను డీనోటిపై చేసి తమకు అప్పగించవలసిందిగా అటవీ శాఖను కోరింది. ఈ అంశం పరిగణనలో ఉండగానే అనుమతులను ఎలా మంజూరు చేస్తారని ఆయన ప్రశ్నించారు.