అంతర్జాతీయం

లష్కరేకు ఐఎస్‌ఐ డైరెక్షన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 21: భారత వ్యతిరేక కార్యకలాపాల కోసం పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ పలు ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తోందనే విషయం మరోసారి ధ్రువపడింది. లష్కర్ ఎ తోయిబా (ఎల్‌ఇటి), అఫ్గాన్ తాలిబన్ ఉగ్రవాద సంస్థలు ఐఎస్‌ఐ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటున్నాయని ఓ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉన్నత స్థాయి కమాండర్ తాజాగా బయటపెట్టాడు. కాశ్మీర్ విషయంలో ఐఎస్‌ఐ క్రూరమైన తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం వివిధ ‘ఇస్లామిక్’ ఉగ్రవాద సంస్థలను ఉపయోగించుకుంటోందని ఐఎస్‌ఐఎస్- ఖోరసాన్ ఉన్నత స్థాయి కమాండర్ హఫీజ్ సరుూద్ ఖాన్ తెలిపాడు. ఐఎస్‌ఐస్‌కు ఈ ఐఎస్‌ఐఎస్- ఖోరసాన్ అఫ్గానిస్తాన్, పాకిస్తాన్‌లోని మధ్య తూర్పు గ్రూప్ శాఖగా పనిచేస్తోంది. పాకిస్తాన్ దుష్ట శక్తులు ప్రత్యేకించి ఆ దేశ సైన్యం, గూఢచార సంస్థ కాశ్మీర్ సమస్యను అడ్డం పెట్టుకొని వివిధ ఇస్లామిక్ జిహాదీ సంస్థలను తమ వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకున్న సందర్భాలను గతంలో చూశామని ఖాన్ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఇంగ్లీషు భాషలో ప్రచురిస్తున్న దాబిక్ అనే మ్యాగజైన్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఖాన్‌ను ఇటీవల ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాశ్మీర్ ప్రజల ఉత్సాహాన్ని, అభినివేశాన్ని కూడా ఐఎస్‌ఐ తన స్వప్రయోజనాల కోసం వాడుకుందని అతను తెలిపాడు. పాకిస్తాన్ తన స్వంత గడ్డపై అల్లా పాలనను ఏర్పాటు చేయలేనప్పుడు కాశ్మీర్‌లో ఎలా ఏర్పాటు చేస్తుందని ఖాన్ ప్రశ్నించాడు. ఐఎస్‌ఐ ఆదేశాల ప్రకారం నడుచుకోవడం వల్ల ఎల్‌ఇటికి కాశ్మీర్‌లోని ఏ ప్రాంతంలోనూ నియంత్రణ లేదని ఖాన్ పేర్కొన్నాడు. కాశ్మీర్ ప్రజలు రహదారుల దిగ్బంధానికి పూనుకుంటే తప్ప వారిని ఎవరూ రక్షించలేరని అన్నాడు. ఇందుకోసం కాశ్మీర్‌లోని అనేక మంది ప్రజలు, ఇతర ఉగ్రవాద సంస్థల్లోని సభ్యులు ఐఎస్‌ఐఎస్‌లో చేరారని వెల్లడించాడు. కాశ్మీర్‌లో విస్తరించడానికి ఐఎస్‌ఐఎస్‌కు గొప్ప అవకాశం ఉందని పేర్కొన్నాడు. అక్కడి ముస్లింలు త్వరలోనే ఆ ప్రాంతానికి ఖిలాఫా విస్తరణకు సంబంధించి సంతోషకరమైన వార్త వింటారని ఖాన్ వెల్లడించాడు.