బిజినెస్

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 5: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో సూచీలు లాభాలను పొందగలిగాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 278.54 పాయింట్లు పుంజుకుని 24,616.97 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 85.10 పాయింట్లు అందిపుచ్చుకుని 7,489.10 వద్ద నిలిచింది. బిర్లా కార్పొరేషన్‌కు తమ సిమెంట్ వ్యాపారాన్ని 4,800 కోట్ల రూపాయలకు అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్‌లోని రిలయన్స్ ఇన్‌ఫ్రా అమ్మడంతో రిలయన్స్ ఇన్‌ఫ్రా షేర్ల విలువ పెరిగింది. ఇక ఆయా రంగాలవారీగా చూస్తే మెటల్, హెల్త్‌కేర్, బ్యాంకింగ్, ఫైనాన్స్, టెలికామ్, కన్జ్యూమర్ డ్యూరబుల్, ఇండస్ట్రియల్ షేర్ల విలువ 3.37 శాతం నుంచి 1.22 శాతం పెరిగింది. బిఎస్‌ఇ మిడ్-క్యాప్ 1.90 శాతం, స్మాల్-క్యాప్ 1.21 శాతం లాభపడ్డాయి. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో చైనా, తైవాన్ సూచీలు వరుసగా 0.63 శాతం, 0.84 శాతం మేర నష్టపోగా, హాంకాంగ్, సింగపూర్, దక్షిణ కొరియా సూచీలు 0.08 శాతం నుంచి 2.53 శాతం వరకు పెరిగాయి. ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, బ్రిటన్ సూచీలు 0.55 శాతం, 0.68 శాతం చొప్పున లాభపడితే, జర్మనీ సూచీ 0.04 శాతం పడిపోయింది.