తెలంగాణ

లక్ష్యాలను అధిగమించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: వయోజన విద్య లక్ష్యాలను అధిగమించే దిశగా ప్రయత్నించాలని నేషనల్ లిటరసీ మిషన్ అథారిటీ (ఎన్‌ఎల్‌ఎంఏ) డిజి వైఎస్‌కె శేషుకుమార్ ఆ శాఖ సిబ్బందికి పిలుపునిచ్చారు. శుక్రవారం బషీర్‌బాగ్‌లోని రాజీవ్ విద్యామిషన్ కార్యాలయంలోని గోదావరి హాల్లో జరిగిన రెండు రాష్ట్రాల వయోజన విద్యా కార్యక్రమాలపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పిలుపునిచ్చారు. మార్చి 20 వరకు జరగనున్న 12వ ఎన్‌ఎల్‌ఎం-ఎన్‌ఐఓఎస్ పరీక్షకు సంసిద్ధత, సన్‌సద్ ఆదర్శ గ్రామ వయోజన గ్రామాల్లో నిర్వహిస్తున్న సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమాలను సమీక్షించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వయోజన విద్యాశాఖ డైరక్టర్లు కె.ఆనందదాస్, బి.వి.బలరామరెడ్డి, ఎన్‌ఆర్‌సి హైదరాబాద్ డైరక్టర్ డాక్టర్ బండి సాయన్న, ఎన్‌ఆర్‌సి విశాఖపట్నం డైరక్టర్ డాక్టర్ శ్రీనివాస్, జిల్లా అధికారులు, సాగీ గ్రామాల నోడల్ అధికారులు, జెఎన్‌ఎస్ డైరక్టర్లు పాల్గొని తమ పరిధిలో జరిగిన కార్యక్రమాల పురోగతిని వివరించారు. అనంతరం ఈ సమీక్షలో డిజి వైఎస్‌కె శేషుకుమార్ మాట్లాడుతూ ఆదర్శవంతంగా తీర్చిదిద్దవలసిన సాగీ గ్రామాల్లో సంపూర్ణ అక్షరాస్యతను సాధించి చూపడం కోసం నేషనల్ లిటరసీ మిషన్ కట్టుబడి ఉందని, పూర్తి స్థాయిలో శక్తియుక్తులను సంబంధిత అధికారులు, సిబ్బంది వినియోగించి ఫలితాలను ఆచరణలో సాధించి చూపాలని డిజి పిలుపునిచ్చారు. 2016 అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం నాటికి రెండు రాష్ట్రాల్లోని సాగీ గ్రామాల్లో సంపూర్ణ అక్షరాస్యతను సాధించి చూపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.