మెయిన్ ఫీచర్

లోక కల్యాణకారుడు మల్లికార్జునుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తవశంకరుడు, అభయంకరుడు, భోళాశంకరుడు పాహిమాం పాహి అని నమఃశివాయ అని అనలేక పోయి ‘ఓ శివా’ అని నోరారా పిలిస్తే చాలు చారెడు నీళ్లు తన తలపై పోస్తేచాలు, గుప్పెడు మారేడుపత్రిలు గుమ్మరిస్తే చాలు నవనీతంలా కరిగిపోయి హిమనగము దిగి భక్తుడెక్కడ ఉంటేఅక్కడికి పరుగెత్తుక వస్తాడన్న ఖ్యాతి వహించినవాడు పార్వతీప్రియవల్లభుడు.
ఆ పార్వతీ ప్రియుడే సర్వులనూ రక్షించేవాడని శ్రీరాముడు సైతం క్షణమూరుకోక శివనామం జపిస్తుంటాడని చరిత్రచెబుతుంది. మార్కండేయుని లాంటి భక్తులను ఆపదలనుంచి వారిని కాపాడడమే కాదు అల్పాయుష్కులను పూర్ణాయుష్కులను చేయడంలో దిట్ట ఆ కైలాసవాసుడు.
కల్యాణకారియైన నారదుడు ఓసారి పరమేశ్వర దర్శనం చేసుకొని ‘అయ్యా! పరమేశ్వరా! నీ దర్శనంతోనే సకల పాపాలు ప్రక్షాళనమవుతాయి. మానవకోటిని ఉద్దరించడానికి నీవే ద్వాదశరూపుడవై జ్యోతిర్లింగరూపంలోనూ దర్శనమిస్తున్నావు. కాని లోకంలో కలిమాయకు లోబడిన మానవులెందరో నీ దర్శనం లేక నీ నామోచ్చారణ చేయజాలక ఎన్నో వ్యధలకు వారు గురవుతున్నారు. అటువంటి వారిని కరుణించడానికి నీవే పూనుకోవాలని అనగా ... దీనజనోద్దారణుడు అపారదయారాశి వెనువెంటనే నా ఆత్మలింగంలో సర్వజ్యోతిర్లింగాల శక్తులను, శివశక్తిని మేళవించి ఓ శివలింగాన్ని సృష్టించి శ్రీకాకుళంలోని రావి వలస గ్రామ సమీపంలో సుమంచు పర్వతాగ్రంపై నిలబెట్టాడట. కాని కలిమాయనో శివమాయనో కాని ఆ పర్వతం కాస్తా పాతాళంలోకి చొచ్చుకొని పోయిందట. ఇప్పటికీ భూమి అడుగున సుమారు 65కి.మీ వరకు ఆ లింగం ఉందని ఇక్కడి స్థానికులు అంటారు.
అంతేకాదు రావణావధానంతరమూ శ్రీరాముడు ఈ రావివలస ప్రాంతానికి వచ్చి కాసేపు సేదతీరే సమయంలో వానరసేనలోని సుషేణుడు ఇక్కడి ప్రాంతమంతా కలయతిరిగి ఇక్కడున్న ఔషధగుణాలు కలిగిన వృక్షాలను చూచాడట. ఇవన్నీ సర్వమానవులకు ఉపయోగపడేటట్లు చేయమని ఆ పరమశివుని గూర్చి తపస్సు ఆరంభించాడట. ఆ తరువాత కొన్నాళ్లకు రాముడు అయోధ్యకు వెళ్లి తిరిగి ఈసుషేణుని సంగతి తెలుసుకొని రమ్మని హనుమన్న పంపించాడట. అపుడు సుషేషుణుడిని చూడగా ఆ వానరశ్రేష్ఠుడు కూర్చున్న ప్రాంతంలో పార్థివ దేహం కనబడగా శివనామోచ్చారణలోనే శివైక్యం చెందాడన్న నిజం తెలుసుకొని మల్లెపూలు ఆ సుషేణుడి దేహం పై పెట్టి రామునకు విషయనివేదన చేశాడట. రాముడు ఖిన్నుడై సుషేణుడి దగ్గరకు రాగా అక్కడ మహాద్భుతంగా సుషేణుడి దేహం నుంచి శివలింగోద్భవం జరిగిందట. అక్కడుంచిన మల్లెల సువాసన ఆ ప్రాంతమంతా వ్యాపించి అక్కడి ఔషధాలు ద్విగుణీకృతమైన శక్తితో ప్రజ్వరిల్లాయట.
ద్వాపరయుగంలోనూ పాండవులు కూడా ఈ శివలింగాన్ని భక్తితో అర్చించేవారట. అర్జునుడు తపస్సు చేసి ఈ పరమశివుణ్ణి మెప్పించాడట. దాంతో ఈ పరమశివునకు మల్లికార్జుడన్న నామం ప్రఖ్యాతి వహించింది. అట్లాఅట్లా ఈ కలియుగంలోను ఆ పరమశివుణ్ణి మల్లికార్జునస్వామిగా కొలిచేవారు కోకొల్లలుగా ఉంటూనే ఉన్నారు. ఆ భక్తాగ్రగణ్యులలో ఒకరైన ఈ ప్రాంత జమీందారు తాను శివుడికి అద్భుతమైన ఆలయాన్ని ఏర్పాటు చేయాలని అనుకొన్నాడట. వెంటనే ఆ ఊరి జనులతో తన కోరికను వ్యక్తపరచగా శివభక్తులంతా పరమానందంతోనాట్యం చేశారట. అందరూ కలసి ఆలయ నిర్మాణం చేసి ఆ శివునకు సంతోషం కలిగిద్దామనుకొంటే దైవ నిర్ణయం వేరుగా ఉంది. ఎన్ని సార్లు ఆలయ నిర్మాణం జరిగినా కట్టిన గోడలు కట్టినట్టే కూలిపోయేవట. ఎండలకు ఎండుతూ వానలకు తడుస్తూన్న సుమారు 3కిమీ వరకు వెడల్పు, 20 అడుగుల ఎత్తువరకూ పెరిగిన ఆ శివుడు మాత్రం తనకు తలపై అచ్చాదన అక్కర్లేదనుకొన్నాడు. అందుకే శివాలయం నిలవలేదు.ఈ సంగతే తన తలంపులో ఏదో లోపం ఉందని దానివల్లనే ఆలయనిర్మాణం జరగట్లేదని తల్లడిల్లే జమీదారైన ఆ శివభక్తునకు శివుడే కలలో తెలిపాడట. ఇక అప్పట్నుంచే ఆ భారీ శివలింగానికే నాటినుంచి నేటిదాకా అత్యంత వైభవోపేతంగా శివాభిషేకాలు, శివార్చనలు శివభక్తులు చేస్తుంటారు. శివరాత్రి పర్వదినాన , ప్రతి సోమవారం నాడు శివునికి ప్రీతిపాత్రమైన శివాభిషేకాలు ప్రత్యేకంగా జరుపుతారు. కార్తికమాసంలో అపరకైలాసంగా రావివలసను భక్తులు భావిస్తారు. ఇట్లా రావివలస అటు శివాలయానికి ప్రత్యేకంగాను, ఇటు అద్భుతమైన ప్రకృతివనరులున్న ప్రాంతం కనుక పర్యాటక క్షేత్రంగాను ప్రసిద్ధినొందే ఈ ప్రాంతాన్ని మరింత శోభాయమానం చేయాల్సి ఉంది.

-ఎస్.వి.ఎస్. సాయ