Others

లవకుశ (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నిసార్లు చూసినా, ఎన్నిసార్లు విన్నా తనివితీరని సినిమా లవకుశ. తనివి తీరని పాటలు, మాటలు, అంతర్లీనంగా దాగిన సంగీతం, పండిత పామరులను ఆనంద సాగరంలో ఓలలాడించి, అంతకుమించి ఈ జీవితానికి ఇంకేం కావాలి? అని తృప్తిని కలిగించే చిత్రం లవకుశ. మనకు ఇందులో నటీనటులు కనిపించరు. పాత్రలు సజీవంగా దర్శనమిస్తాయి. ముఖ్యంగా సీతగా అంజలీదేవి జన్మ ఈ చిత్రంతో చరితార్ధం అయ్యింది. సీత గనుక నిజంగా వుంటే ఆ అంజలీదేవి లాగే వుండే వుంటుంది అని మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. సినిమా చూస్తున్నంతసేపు తాదాత్మ్యం పొందుతాం. అనుభూతిస్తాం. ఆ వాల్మీకి మహర్షిగా చిత్తూరు నాగయ్య ఆహా చేతులెత్తి నమస్కరించబుద్ధవుతుంది. ఆహార్యంలోనైతేమి, ఆర్ధత గల డైలాగులు పలకడంలోనైతేనేమి, వాల్మీకి మహర్షే మనకు దర్శనమిస్తాడు. ఇక రాముడిగా రామారావు సరేసరి. పురాణ పాత్రలకు ఆయన పెట్టింది పేరు. సుశీల, లీల ప్రభృతులు ఘంటసాల సంగీతంలో ఆలపించిన ప్రతి ఒక్క గీతం ఆణిముత్యం. కన్నాంబ, సత్యనారాయణ, కాంతారావుల నటన ఈ చిత్రంలో ఎన్నిసార్లు చూసినా మళ్లీమళ్లీ చూడాలనిపిస్తుంది. లేరు లవకుశకు సాటి అని పాడినట్లుగానే ఈ చిత్రానికి సాటి మరొకటి లేదు. చివర్లో తండ్రి, కొడుకుల యుద్ధంలో అద్భుతంగా ప్రేక్షకులను సమ్మోహితులను చేశారు. లవకుశ అంటే మరెంత మంది నిర్మించినా ఈ చిత్రంలా మరెవరూ నిర్మించలేరు.

- కోలపల్లి ఈశ్వర్, నెల్లూరు