బిజినెస్

20 లక్షలకు చేరిన టెలినార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: ఉచిత బీమా సేవలను వినియోగించుకుంటున్న తమ వినియోగదారుల సంఖ్య 20‚లక్షలకు చేరిందని టెలినార్ ఇండియా సంస్థ తెలిపింది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బిజినెస్ హెడ్ శ్రీనాథ్ కొటియన్ సోమవారం తెలిపారు. సురక్షా ఉచిత బీమా పేరుతో తమ వినియోగదారులకు ఈ బీమా అందిస్తున్నట్లు వెల్లడించారు. రెండు రాష్ట్రాల్లోని 265 రిటైల్ ఔట్‌లెట్ల ద్వారా ఈ బీమా సేవలను పొందవచ్చని పేర్కొన్నారు. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్, మైక్రో ఎన్సూర్‌తో కలిసి ఈ బీమా సేవలను అందిస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. నిర్దిష్ట వినియోగదారుడు మరణించినట్లయితే మరణ ధృవీకరణ పత్రం, నామినీ ఐడి ప్రూఫ్, సిమ్‌కార్డు వంటివి దాఖలు చేయడం ద్వారా క్లెయిమ్ పొందవచ్చని వివరించారు. ప్రస్తుతం టెలినార్‌కు రెండు రాష్ట్రాల్లో 50 లక్షల మంది వినియోగదారులు ఉన్నట్లు తెలిపారు.