రాష్ట్రీయం

లక్ష్యం.. విశ్వనగరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని తెరాస ఎన్నికల ప్రణాళికలో పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేకంగా రూపొందించిన మేనిఫెస్టోను తెలంగాణ భవన్‌లో శనివారం విడుదల చేశారు. తెరాస ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన పనులను పేర్కొంటూ, చేయబోయే వాటిని కలిసి ఐటి మంత్రి కెటిఆర్, పార్టీ నేతలు డి శ్రీనివాస్ తదితరులు మ్యానిఫెస్టో విడుదల చేశారు. విశ్వనగరంగా హైదరాబాద్ ఎదగడానికి అవసరమైన అన్నిచర్యలు జిహెచ్‌ఎంసి తీసుకునేలా తెరాస కృషి చేస్తోందని పేర్కొన్నారు. చాలినంత నీటి సరఫరా, మెరుగైన పారిశుద్ధ్యం, సమర్ధవంతమై ప్రజా రవాణా వ్యవస్థ, అందుబాటులో గృహవసతి, శాంతిభద్రతల పరిరక్షణ, పౌరుల భాగస్వామ్యంతో సుపరిపాలన, భద్రత, రక్షణ మొదలైనవి ప్రాధాన్యతాంశాలుగా తెరాస పాలన సాగిస్తుందని భరోసా ఇచ్చారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా నగర పాలక చట్టాలను మార్చనున్నట్టు ప్రకటించారు. ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందిస్తామన్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలో ఐదువేల కోట్లతో గోదావరి మొదటి దశ, కృష్ణా మూడో దశ తాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసినట్టు చెప్పారు. వీటి ద్వారా మరో 30 లక్షల మందికి తాగునీరు అందించనున్నట్టు చెప్పారు. 1900 కోట్లతో 280 కిలోమీటర్ల పొడవైన పైపులైనును వేస్తున్నామని, వచ్చే మూడు దశాబ్దాల్లో హైదరాబాద్ నీటి అవసరాలు దృష్టిలో పెట్టుకొని 30 టిఎంసిల సామర్ధ్యంగల రెండు జలాశయాలను నిర్మించనున్నట్టు చెప్పారు.
నిరంతర విద్యుత్‌కు భరోసా
తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి తెలంగాణలో తీవ్రమైన విద్యుత్ కొరత ఉందని, సమగ్ర వ్యూహాన్ని అమలుచేసి కొరత అధిగమించినట్టు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో తెలంగాణ స్థాపిత విద్యుత్ సామర్థ్యం ప్రస్తుత 4,760 మెగావాట్లనుంచి 24 వేల మెగావాట్లకు పెరుగుతుంది. దీనిద్వారా హైదరాబాద్ అభివృద్ధి చెందిన దేశాల్లోని ఆధునిక నగరాల సరసన నిలిచేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నారు. హైదరాబాద్ కోసం ప్రత్యేకంగా 420 కెవి లైన్ గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తారు. కొత్త విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణానికి 1920 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. నివాస గృహాలు, వ్యాపార సముదాయాల్లో సౌర విద్యుత్ వాడకాన్ని పెంచేలా ప్రోత్సాహకాలు, సబ్సిడీలు అందించనున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతమున్న వీధి లైట్ల స్థానంలో పర్యావరణ అనుకూల ఎల్‌ఈడీ లైట్లు తీసుకు రానున్నట్టు తెలిపారు. వీటివల్ల 30 మెగావాట్ల విద్యుత్, 80 కోట్ల రూపాయలు ఆదా అవుతాయి.
వందశాతం అక్షరాస్యత కోసం కృషి చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన పరికరాలతో డిజిటల్ తగతులు, విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం, ప్రైవేటు పాఠశాల్లో ఫీజుల నియంత్రణకు కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్టు చెప్పారు. స్కూళ్లు, కాలేజీల్లో ఉర్దూ మొదటి భాషగా ఎంచుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్టు తెలిపారు. మైనారిటీలకు పది జిల్లాల్లో పది ఆశ్రమ పాఠశాలలు, పది జూనియర్ కాలేజీలు మంజూరు చేసినట్టు చెప్పారు. హైదరాబాద్‌లో నెలకొన్న గంగా జమునా తెహజీబ్‌ను పరిరక్షించేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. నగరమంతా ఉచిత వైఫై సదుపాయం, ప్రతి పదివేల జనాభాకు ఒక ఆదర్శ మార్కెట్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. నగరంలో ఆధునిక క్రీడా సౌకర్యాలు కల్పిస్తారు. నగరంలో మరిన్ని సైక్లింగ్ ట్రాక్స్, స్లైక్లింగ్ స్టేషన్లును ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. లైబ్రరీ సెస్‌ను గ్రంథాలయాల అభివృద్ధికి వినియోగిస్తారు. గ్రంథాలయాల ఆధునీకరణతోపాటు కొత్తవి ఏర్పాటు చేస్తారు.
మ్యానిఫెస్టోలో కొన్ని అంశాలు
* నగరంలో 36 ఆధునాతన స్మశాన వాటికలు నిర్మాణం.
* జూబ్లీ హిల్స్ ప్రాంతంలో మహాప్రస్థానం పేరిట ఆధునాతన స్మశాన వాటిక.
* గ్రీన్ కర్టెన్ పేరిట నగరంలో పది కోట్ల మొక్కల పెంపకం.
* కొత్తగూడలో బొటానికల్ గార్డెన్.
* పోలీస్ వ్యవస్థ ఆధునీకరణకు 685 కోట్లు.
* బంజారాహిల్స్‌లో 24 అంతస్తుల పోలీస్ కమాండ్, కంట్రోల్ సెంటర్ నిర్మాణం. నగరంలో లక్షకు పైగా సిసి కెమెరాలు.
* మహిళా భద్రతకు ప్రాధాన్యత, 100 షీ టీమ్స్ ఏర్పాటు.
* మహిళల కోసం ఉచిత షటిల్ బస్సు, షీ క్యాబ్స్ ఏర్పాటు.
* మహిళా పోలీస్ స్టేషన్ల ఏర్పాటు.
* 13 మురికి వాడల్లో 17 ప్రదేశాల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు.
* ఆసరా పథకం కింద నాలుగు లక్షల మందికి పెన్షన్లు.
* 5 రూపాయల భోజన కేంద్రాలు 200కు పెంపు.
* మాతా శిశు సంరక్షణ కోసం ఆరు వందల కోట్లతో ఆరోగ్య లక్ష్మి.
* ట్రాఫిక్ చిక్కులు లేకుండా ప్రపంచస్థాయి రవాణా వ్యవస్థ.
* వైట్ ట్యాప్ రోడ్లు, రోడ్ల మరమ్మతు, 158 కిలోమీటర్ల నాలుగు లైన్ల ఔటర్ రింగురోడ్డు.
* నగరానికి ప్రత్యేక పవర్ ఐల్యాండ్.
* 72 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్లకు మెట్రో విస్తరణ.
* శంషాబాద్ విమానాశ్రయం నుంచి యాదాద్రి వరకు ఎంఎంటిఎస్ సౌకర్యం.