బిజినెస్

లాభనష్టాల మధ్య ఊగిసలాట స్వల్ప నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 23: దేశీయ స్టాక్ మార్కెట్లు గడచిన వారం తీవ్ర ఒడిదుడుకుల మధ్య స్వల్ప నష్టాలకు లోనయ్యాయి. 20 నెలలకిపైగా కనిష్ట స్థాయి నుంచి కోలుకున్న సూచీలు.. మదుపరుల పెట్టుబడులు-అమ్మకాల మధ్య ఊగిసలాడాయి. ఒకానొక దశలో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 24 వేల స్థాయిని, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 7,400 స్థాయిని కోల్పోయాయి. బుధవారం చోటుచేసుకున్న భారీ నష్టాలతో మదుపరుల సంపద లక్షల కోట్ల రూపాయల్లో ఆవిరైపోగా, శుక్రవారం నమోదైన లాభాలతో తిరిగి సర్దుకుంది. ఈ క్రమంలో సెనె్సక్స్ 19.38 పాయింట్లు పడిపోయి 24,435.66 వద్ద ముగియగా, నిఫ్టీ 15.35 పాయింట్లు కోల్పోయి 7,422.45 వద్ద నిలిచింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటును ఈ ఏడాదికిగాను అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) తగ్గించడం, గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు రికార్డు స్థాయిలో పడిపోవడం, గత ఏడాదికి ప్రకటించిన చైనా వృద్ధిరేటు నిరాశపరచడం వంటివి గడచిన వారం స్టాక్ మార్కెట్లను కుంగదీశాయి. అయితే చైనా తమ ఆర్థిక వ్యవస్థను బలపరచడానికి ఉద్దీపనలు ప్రకటించవచ్చన్న సంకేతాలు, ఐరోపా యూనియన్ సైతం ఉద్దీపన ప్యాకేజీలను ఇవ్వనుందన్న వార్తలు, గ్లోబల్ మార్కెట్‌లో తిరిగి కోలుకున్న ముడి చమురు ధరలు మదుపరులను పెట్టుబడుల వైపునకు నడిపించి, మార్కెట్లను మళ్లీ లాభాల్లోకి తీసుకొచ్చాయి. ఇకపోతే విద్యుత్, చమురు, సహజవాయువు, రియల్టీ, ఎఫ్‌ఎమ్‌సిజి, ప్రభుత్వరంగ సంస్థలు, లోహ, టెక్నాలజీ, హెల్త్‌కేర్, ఆటో, ఐటి రంగాల షేర్లలో గడచిన వారం అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఈ రంగాల షేర్ల విలువ 4.76 శాతం నుంచి 0.12 శాతం పతనమైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, కోల్ ఇండియా, సిప్లా, హిందుస్థాన్ యునిలివర్, మారుతి, భారతీ, ఎయిర్‌టెల్, డాక్టర్ రెడ్డీస్, ఐటిసి, ఒఎన్‌జిసి షేర్ల విలువ 6.45 శాతం నుంచి 1.41 శాతం వరకు క్షీణించింది. అయితే యాక్సిస్ బ్యాంక్, గెయిల్, బిహెచ్‌ఇఎల్, టాటా స్టీల్, హీరో మోటోకార్ప్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎల్‌అండ్‌టి, అదానీ పోర్ట్స్ షేర్ల విలువ 13.50 శాతం నుంచి 1.63 శాతం వరకు పెరిగింది. ఇక విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ) గడచిన వారం 6,214.04 కోట్ల రూపాయల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. బిఎస్‌ఇ మిడ్-క్యాప్ 1.46 శాతం, స్మాల్-క్యాప్ 1.71 శాతం దిగజారాయి. టర్నోవర్ విషయానికొస్తే గడచిన వారం బిఎస్‌ఇ 15,848.61 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ 88,235.23 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు వారం బిఎస్‌ఇ టర్నోవర్ 16,139.55 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ టర్నోవర్ 91,174.44 కోట్ల రూపాయలుగా ఉంది.