జాతీయ వార్తలు

లాన్స్‌నాయక్ గోస్వామికి అశోక్‌చక్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 25: అరవై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా నిరుపమాన సాహసాలను కనబరిచిన 841 మంది పోలీసులకు ప్రతిష్టాత్మక రాష్టప్రతి పతకాలు దక్కాయి. ప్రతిష్టాత్మక అశోక్ చక్ర అవార్డును లాన్స్‌నాయక్ మోహన్‌నాథ్ గోస్వామికి మరణానంతరం ప్రకటించారు. ఈఅవార్డులో భాగంగా నాలుగు కీర్తిచక్ర, 11 శౌర్యచక్ర పురస్కారాలను ప్రకటించారు. 48 సేనా పతకాలను రాష్టప్రతి ఆమోదించారు. అలాగే 29 పరమ విశిష్ట సేవాపతకాలను, ఐదు ఉత్తమ సేవాపతకాలను,37 సేనాపతకాలను, 16 వాయుసేనా పతకాలు రాష్టప్రతి ప్రకటించారు. 2015 సెప్టెంబర్‌లో కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని అటవీ ప్రాంతంలో జరిగిన మిలిటెంట్ల దాడిలో మృతి చెందిన లాన్స్‌నాయక్ మోహన్‌నాథ్ గోస్వామికి ప్రతిష్టాత్మక అశోక్‌చక్ర పురస్కారం లభించింది. మిలిటెంట్లతో జరిగిన హోరాహోరీ పోరులో తీవ్రంగా గాయపడ్డప్పటికీ లాన్స్‌నాయక్ గోస్వామి తన ప్రాణాలకు తెగించి సహచరులను రక్షించాడు. ఒక్కరిగా మిలిటెంట్లను హతమార్చాడు. అంతేకాకుండా సహచరులను ప్రాణాలతో కాపాడి అశువులుభాసినందుకు గాను అశోక్‌చక్ర ప్రకటించారు. దేశంలో సంచలనం సృష్టించిన షీనాబోరా కేసు, శారదా చిట్స్ కుంభకోణం, నొయిడా ఇంజనీర్ అవినీతి కేసులను ఛేదించిన సిబిఐ అధికారులకు రాష్టప్రతి పోలీస్ మెడల్స్ దక్కాయి. త్రిపుర్ కేడర్ 1993 ఐపిఎస్ బ్యాచ్ అధికారి రాజీవ్ సింగ్‌కు రాష్టప్రతి పోలీస్ పతకం దక్కింది. కోట్లాది రూపాయల శారదా చిట్స్ కుంభకోణం కేసును దర్యాప్తు చేసిన ప్రత్యేక బృందానికి రాజీవ్ సింగ్ సారథ్యం వహించారు. అలాగే 2000 ఐపిఎస్ బ్యాచ్ అధికారి లత మనోజ్ కుమార్‌కు విశిష్ఠ పురస్కారం లభించింది. రాజస్థాన్ కేడర్‌కు చెందిన కుమార్ ముంబయిలో అత్యంత సంచలనం రేకెత్తించిన షీనాబోరా హత్య కేసును ఛేదించారు.