బిజినెస్

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 25: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఉద్దీపనలపై విశ్వాసంతో మదుపరులు పెట్టుబడులకు ముందుకొచ్చారు. దీంతో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 50.29 పాయింట్లు లాభపడి 24,485.95 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 13.70 పాయింట్లు కోలుకుని 7,436.15 వద్ద నిలిచింది. మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్, రియల్టీ, ఐటి, బ్యాంకింగ్ రంగాల షేర్ల విలువ 1.58 శాతం నుంచి 0.21 శాతం పెరిగింది. బిఎస్‌ఇ స్మాల్- క్యాప్ 0.94, మిడ్-క్యాప్ 0.24 శాతం లాభపడ్డాయి. చైనా, హాంకాంగ్, జపాన్ సూచీలూ లాభాల్లో ముగియగా, ఐరోపా మార్కెట్లు ఆశాజనకంగా కదలాడాయి.
నేడు మార్కెట్లకు సెలవు
67వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ మార్కెట్ కార్యకలాపాలకు దూరంగా ఉండనున్నాయి. తిరిగి బుధవారం యథాతథంగా మార్కెట్ ట్రేడింగ్ నడుస్తుందని రెండు స్టాక్ ఎక్స్‌చేంజ్ వర్గాలు తెలియజేశాయి.
ప్రభుత్వ బాండ్లకు విశేష స్పందన
నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సోమవారం ప్రభుత్వ బాండ్లకు నిర్వహించిన వేలానికి విదేశీ మదుపరుల నుంచి విశేష స్పందన లభించింది. 3,476 కోట్ల రూపాయల విలువైన రుణ సెక్యూరిటీలను వేలం వేయగా, 7,093 కోట్ల రూపాయల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. రోజువారి సాధారణ ట్రేడింగ్ కార్యకలాపాలు ముగిసిన అనంతరం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండు గంటలపాటు ఈ వేలం జరిగింది. ఎన్‌ఎస్‌ఇలో ప్రభుత్వ రుణ సెక్యూరిటీల్లో విదేశీ పెట్టుబడులకున్న పరిమితిని 1,31,924 కోట్ల రూపాయల నుంచి 1,35,400 కోట్ల రూపాయలకు పెంచారు. దీంతో ఈ బాండ్ల వేలాన్ని ఎన్‌ఎస్‌ఇ నిర్వహించింది.