ఆంధ్రప్రదేశ్‌

లంచం కేసులో ఎస్సైకు మూడేళ్ల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఫిబ్రవరి 5: సిడి ఫైలు పంపించడానికి లంచం స్వీకరిస్తూ ఏసిబికి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ఎస్సైకి మూడేళ్ల కఠిన కారాగారశిక్ష, లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ విజయవాడ ఎసిబి కోర్టు శుక్రవారం తీర్పుచెప్పింది. పశ్చిమ గోదావరి జిల్లా ధర్మాజీగూడెంనకు చెందిన గారపాటి నాగ బుద్ధ వరప్రసాద్ 2006లో తన కుమారుడు 354 సిఆర్‌పిసి కింద అరెస్టు అయినందున బెయిల్ పిటీషన్ మీద కోర్టులో వాదించడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు సిడి ఫైలు పంపాలని అప్పటి ధర్మాజీగూడెం ఎస్‌ఐ ఆర్‌విఎస్ కమలాకరరావును కోరారు. అయితే సిడిఫైలు పంపించడానికి రూ.10 వేలు లంచంగా ఇవ్వాలని ఎస్సై డిమాండ్‌చేశారు. అంత ఇచ్చుకోలేనని, ఎనిమిది వేల రూపాయలు ఇస్తానని వరప్రసాద్ బేరమాడుకున్నాడు. అనంతరం లంచం ఇచ్చేందుకు ఇష్టంలేక వరప్రసాద్ ఏసిబి అధికారులకు 2006 మే 8వ తేదీన ఫిర్యాదుచేశాడు. అదే రోజు ఎస్సై కమలాకరరావు లంచం సొమ్ము తీసుకుంటుండగా అప్పటి ఏసిబి డిఎస్‌పి మహిపాల్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ కనకరాజు దాడిచేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఎస్సైపై నేరం రుజువుకావడంతో మూడు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ విజయవాడ ఏసిబి కోర్టు న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ తీర్పుచెప్పారు.