అంతర్జాతీయం

ప్రయోగశాలలో మాంసం ఉత్పత్తి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండో-అమెరికా శాస్తవ్రేత్త ఆవిష్కరణ

వాషింగ్టన్, మార్చి 13: భారత సంతతికి చెందిన అమెరికా శాస్తవ్రేత్త నేతృత్వంలోని ఒక బృందం ప్రయోగశాలలో జంతు కణాల నుంచి కేవలం 9 నుంచి 21 రోజుల్లోనే కల్తీ రహిత మాంసాన్ని ఉత్పత్తిచేసే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. ప్రపంచ వ్యాప్తంగా పెద్దమొత్తంలో జంతు వధ జరగకుండా నిరోధించేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. రానున్న కొద్ది సంవత్సరాల్లో విస్తృతంగా ఈ పద్ధతిని ఉపయోగించి వాణిజ్య అవసరాలకు అనుగుణంగా పెద్దమొత్తంలో మాంసాన్ని ఉత్పత్తి చేయగలమని, తద్వారా మాంసంకోసం జంతు వధ జరగకుండా అడ్డుకట్ట వేయగలమని ఆశిస్తున్నట్లు అమెరికాలో కార్డియాలజిస్టుగా పనిచేస్తున్న ఉమా ఎస్.వలేటి తెలిపారు. క్రూరమైన చర్యలకు పాల్పడకుండా మాంసాన్ని ఉత్పత్తి చేసేందుకు ఇది అనువైన పద్ధతి అని, జంతు కణాలను ఉపయోగించి ప్రయోగశాలలో తాము తయారు చేసిన మాంసంలో అధిక సాంద్రత కలిగిన కొవ్వు (హై సాచ్యురేటెడ్ ఫ్యాట్) ఉండదని, పైగా ఈ మాంసాన్ని బాక్టీరియా సైతం కలుషితం చేయలేదని, కనుక దీనివలన ఆరోగ్యంపై ఎటువంటి దుష్ప్రభావం ఉండదని వివరించారు. (చిత్రం) ప్రయోగశాలలో ఉత్పత్తి చేసిన మాంసాన్ని చూపుతున్న
ఉమా ఎస్.వలేటి