రాష్ట్రీయం

నేత్ర పర్వంగా లక్ష కుంకుమార్చన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుచానూరు, డిసెంబర్ 7: శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయంలో సోమవారం లక్ష కుంకుమార్చన సేవ నేత్ర పర్వంగా సాగింది. అమ్మవారిని వేకువ జామున 4 గంటలకు సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్యార్చన నిర్వహించి నైవేద్యం సమర్పించారు. అనంతరం అమ్మవారి ఉత్సవ మూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఉదయం 6 గంటలకు అమ్మవారి సన్నిధి నుంచి వేంచేపుగా శ్రీకృష్ణ స్వామి ముఖ మండపానికి తీసుకువచ్చి కొలువుదీర్చారు. అనంతరం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వేద మంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ పాంచారాత్ర ఆగమ శాస్త్రోక్తంగా ఆగమ పండితులు, లక్ష కుంకుమార్చన సేవను నేత్ర పర్వంగా నిర్వహించారు. అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలకు నాందిగా సోమవారం సాయంత్రం అంకురార్పణ ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఉద్యాన వనంలో శాస్త్రోక్తంగా సేకరించిన పుట్టమన్నును ఆలయానికి తీసుకువచ్చి అందులో నవధాన్యాలను వేసి అంకురార్పణకు శ్రీకారం చుట్టారు. బ్రహ్మోత్సవాలకు అడ్డంకులు లేకుండా సాగడానికి దేవతల సేనాధిపతి అయిన విష్వక్సేనుల వారు పుట్టమన్ను తేవడం ఆనవాయితీ.

శ్రీశైల మల్లన్న సేవలో హోంమంత్రి
శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో కొలువైన శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి వార్లను డిప్యూటీ సిఎం, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సోమవారం దర్శించుకున్నారు. దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి కెవి సాగర్‌బాబు, అర్చకులు చినరాజప్పకు పూర్ణకుంభ స్వాగతం పలికారు.