కర్నూల్

చంద్రబాబు పెద్ద భూ బకాసురుడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* టిడిపి హయాంలో బికార్లు అవుతున్న రైతులు..
* వలస బాటలో వ్యవసాయ కూలీలు..
* సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుబ్బారావు
కర్నూలు , నవంబర్ 29:గత ప్రభుత్వాలు విడతల వారిగా పేదలకు ప్రభుత్వ భూములను పంచితే, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని పేర పేద ప్రజలకు ఇచ్చిన భూములను బలవంతంగా తీసుకుని భూబకాసురుడిగా పేరొందుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దడాల సుబ్బారావు తీవ్రస్థాయిలో విమర్శించారు. నగరంలోని సుందరయ్య భవన్‌లో ఆదివారం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9-77 జీఓని ఏర్పాటు చేసి పేద ప్రజలకు భూమిని పంపిణీ చేసిన తర్వాత ఆ భూమిని కొనటానికి, అమ్మటానికి వీలు లేకుండా చేశారన్నారు. ఒకవేళ ప్రభుత్వం ఆ భూమిలో ఏదైనా పరిశ్రమ పెట్టాలనుకుంటే అప్పటి మార్కెట్ ధర ప్రకారం రైతులకు నష్ట పరిహారం ఇచ్చి భూసేకరణ కార్యక్రమం చేపట్టాలని నిబంధన చేశారని గుర్తు చేశారు. అలాగే 2014 భూసేకరణ చట్టం ప్రకాం గ్రామ సభలు నిర్వహించి అందులో 75శాతం రైతులు ఆమోదం తెలిపిన తర్వాతనే భూసేకరణ చేపట్టాలని నిబంధన ఉందన్నారు. అయ్యితే సిఎం చంద్రబాబు భూసేకరణ చట్టానికి తూట్లు పొడుస్తూ బలవంతంగా భూసేకరణ చేపట్టడమే కాకుండా సాగు చేసుకుంటున్న రైతులకు పైసా నష్ట పరిహారం కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్ట పరిహారం మంజూరులో కూడా తేడా చూపిస్తున్నారని, దీంతో పెద్ద రైతులు కూడా బికారీలుగా, వ్యవసాయ కూలీలు వలస కూలీలుగా మారుతున్నారని వాపోయారు. బలవంతపు భూసేకరణ కార్యక్రమాన్ని చేపట్టేది కూడా మంత్రులు ఆక్రమించుకున్న భూములను కాపాడటానికేనని విమర్శించారు. ముఖ్యంగా భూసేకరణ చేసేటప్పుడు ఏ పరిశ్రమ స్థాపనకు ఆ భూమిని వినియోగిస్తున్నారో స్పష్టంగా తెలపకుండా వేల ఎకరాలను సేకరించి, ఆ తర్వాత వాటిని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారన్నారు. ఇకనైనా భూసేకరణపై స్పష్టత ఇచ్చి రైతుల ఆమోదం తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన పట్టాలను పూర్తిగా మార్చేస్తున్నారని, ఒకరు పొలం సాగు చేస్తుండగా పట్టా మాత్రం వేరొక జిల్లాకు చెందిన వారి పేరు మీద మారుస్తూ రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
వైఎస్ హయాంలో ఐఎఎస్‌లకు పట్టిన గతే వీరికి పడుతుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు టిడిపి కార్యకర్తలకు ఉపాధి పథకాలుగా మారాయని ఎద్దేవా చేశారు. బలవంతపు భూసేకరణ చట్టాన్ని ఆపకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ఆయనతో పాటు సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు.

ఆదోని ఇగ్నో కేంద్రానికి
రాష్ట్రంలో మూడవ స్థానం
ఆదోనిటౌన్, నవంబర్ 29: రాష్ట్రంలోని దూరవిద్య ఇగ్నో కేంద్రాల్లో ఆదోనికి 3వ స్థానం దక్కిందని, రాయలసీమలో మొదటి స్థానంలో ఉందని ఇగ్నో విజయవాడ ప్రాంతీయ సహా య సంచాలకులు డాక్టర్ ప్రసాద్‌బాబు పేర్కొన్నారు. ఆదివారం ఆదోని ఇగ్నో కేంద్రాన్ని కో ఆర్డీనేటర్ సురేష్ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదోని ఇగ్నో కేంద్రంలో సుమారు 400 మం ది విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారన్నారు. కర్నూలుల్లో కేవలం 70 మం ది మాత్రమే ఉన్నారన్నారు. ఈప్రాంతంలో ఎక్కువమంది దూర విద్య కోసం ఇగ్నో కేంద్రంలో చేరడం వల్ల ఇక్కడే పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశమని స్పష్టం చేశారు. ఇగ్నో కేంద్రం ద్వారా ఇంజినీరింగ్ కోర్సులను మళ్లీ అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. గతంలో ఇంజనీరింగ్ కోర్సు లు ఉండేవని, అయితే 2012లో నిలిపివేశామన్నారు. ఇగ్నో ద్వారా కొత్తగా పట్టణాభివృద్ధి ప్రణాళికపై ప్రత్యేక పిజి కోర్సులు ఆదోనిలో అందుబాటులోకి తెస్తామన్నారు. పూర్వ ప్రాథమిక విద్య కోసం ప్రత్యేకంగా పిజి డిప్లొమా కో ర్సు ఆదోనిలో అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం వీటి అడ్మిషన్లు జరుగుతున్నాయన్నారు. పాఠశాలల్లో విద్యాబోధన, విద్యార్థులకు అవగాహనపై ప్రత్యేకంగా గైడెన్స్ సర్ట్ఫికెట్ కోర్సు అందిస్తున్నామని వివరించారు. అలాగే కమ్యూనికేషన్, ఐటి కోర్సులు కూడా అందిస్తున్నామని వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఎన్‌ఎస్‌ఎస్ అధికారి జోనార్థన్ విక్లిఫ్ పాల్గొన్నారు.
ప్రతి 4 గ్రామాలకు ఒక గ్రంథాలయం
* రూ. 25 లక్షలతో భవన నిర్మాణాలు
* సంస్థ చైర్మన్ ధనారెడ్డి
నందికొట్కూరు/ మిడుతూరు, నవంబర్ 29:జిల్లా వ్యాప్తంగా ప్రతి 4 గ్రామాలకు ఒక గ్రంథాలయం ఏర్పా టు చేస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంపత్ ధనారెడ్డి తెలిపారు. ఆయనతో పాటు సెక్రటరీ లలిత ఆదివారం నందికొట్కూరు, మిడుతూరు గ్రంథాలయాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ నందికొట్కూరులో శిథిలావస్థకు చేరుకున్న గ్రంథాలయ భవనం స్థానంలో రూ. 25 లక్షలతో నూతన భవన నిర్మా ణం చేపడుతామన్నారు. జిల్లాలో 63 గ్రంథాలయాలు వుండగా కేవలం పదింటికి మాత్రమే సొంత భవనాలు వున్నాయని, రెండేళ్ల కాలంలో 30 గ్రంథాలయ భవనాలు నిర్మించేందుకు చర్యలు చేపట్టామన్నారు. వసతులు వున్న గ్రంథాలయాల్లో ఇంటర్‌నెట్ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. అలాగే సిసి కెమెరాలు ఏర్పాటు చేసేందుకు కూడా ప్రతిపాదనలు పంపామన్నారు. ప్రతి గ్రంథాలయంలో 7,600 పుస్తకాలు వున్నాయని, పాఠకులు ఇంకా ఏమైనా పుస్తకాలు కావాలని మా దృష్టికి తెస్తే వాటిని వెంటనే అందుబాటులో వుంచుతామన్నారు. నర్సరీ నుంచి ఎంబిబిఎస్ వరకూ అన్ని రకా ల పుస్తకాలు, మెటీరియల్‌ను గ్రంథాలయాల్లో వుంచుతామన్నారు. పత్తికొండ, దేవనకొండ, కృష్ణగిరి, బనగానపల్లె, సంజామల, ఎమ్మిగనూరు, కొత్తపల్లె, కౌతాళం, ఆత్మకూరు ప్రాంతాల్లో గ్రంథాలయాల భవనాలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించారని, త్వరలోనే నిర్మాణాలు చేపడుతామన్నారు. మండల కేంద్రా ల్లో నిర్మించే గ్రంథాలయ భవనాలకు రూ. 10 లక్షలు, నియోజకవర్గ కేంద్రంలో నిర్మించే భవనాలకు రూ. 25 లక్షలు కేటాయిస్తున్నామన్నారు. వారి వెంట పాఠకులు రవీంద్రారెడ్డి, రమణారెడ్డి, గ్రంథాలయ సిబ్బంది శ్రీనివాసులు ఉన్నారు.

పుట్టాలమ్మలో వైభవంగా
కార్తీక పూజలు
ఆళ్లగడ్డ, నవంబర్ 29: రామతీర్ధం పుట్టాలమ్మలో కార్తీకమాసం మూడవ ఆదివారాన్ని పురస్కరించుకొని భక్తులు పెద్దసంఖ్యలో దీపాలు వెలిగించి పూజలు చేశారు. ఈఓ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేశారు. పుట్టాలమ్మ తల్లికి భక్తులు పూజలు చేశారు. అలాగే శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యేశ్వరస్వామి, పరశురామేశ్వరస్వామి, పార్వతీదేవి అమ్మవారు, కొండపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి, లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం ఎదుట ఉన్న ధ్వజస్తంభం, నాగులకట్ట వద్ద మహిళలు కార్తీకదీపాలు వెలిగించారు. భక్తులకు అన్నసత్ర నిర్వాహకులు అన్నదానం చేశారు.
ఘనంగా గౌరమ్మ, గంగమ్మ గ్రామోత్సవం
చాగలమర్రి, నవంబర్ 29: చాగలమర్రిలో ఆదివారం కార్తీకమాసాన్ని పురస్కరించుకుని గౌరమ్మ, గంగమ్మ దేవతల గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. అమ్మవారిశాలలో దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలతో గ్రామోత్సవం జరిపారు. శ్రీ బుగ్గ మల్లేశ్వర స్వామి సన్నిధిలో విశేష పూజలు నిర్వహించారు.

కార్తీక వనభోజనాలు
చాగలమర్రిలో కార్తీకమాసం సందర్భంగా ఆదివారం శ్రీ బుగ్గమల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఆర్యవైశ్యులు కార్తీక వన భోజనాన్ని నిర్వహించారు. ఆర్యవైశ్య మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. శ్రీ బుగ్గ మల్లేశ్వరస్వామికి కార్తీక పూజలు, అభిషేకాలు పెద్ద ఎత్తున నిర్వహించారు.
నేడు ఆలయాల్లో నోములు, అభిషేకాలు
నంద్యాల టౌన్, నవంబర్ 29: కార్తీకమాసాన్ని పురస్కరించుకుని నంద్యాల పట్టణంలోని పలు ఆలయాల్లో సోమవారం భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి అభిషేకాలు చేయనున్నారు. కార్తీకదీపాలు వెలిగించనున్నారు. మూడవ సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని క్యూలైన్లు ఏర్పాటు చేశారు. నవనందుల దర్శనం కోసం భక్తులు ఆటోలు, ఇతర వాహనాలను ఏర్పాటు చేసుకున్నారు. తెల్లవారుజామునే వెళ్లడానికి సిద్ధం కాగా, కాలినడకన వెళ్లే భక్తులు పట్టణంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం వద్దకు ఆదివారం రాత్రే చేరుకున్నారు.

మహానందిలో కమ్మసత్రం
నిర్మాణానికి భూమిపూజ

మహానంది, నవంబర్ 29: మహానంది పుణ్యక్షేత్రంలో కమ్మసంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన సత్రం, కళ్యాణ మండపానికి భూమి పూజా కార్యక్రమాలు ఆదివారం నిర్వహించారు. మహానంది గ్రామ సమీపంలోని తెలుగుగంగ కాల్వ సమీపంలో నిర్వహించిన ఈ భూమి పూజా కార్యక్రమానికి కమ్మ సంఘం నాయకులతో పాటు 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ శ్రీనివాస శేష సాయిబాబా, పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్రకూమార్, ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం వన భోజన మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించారు. వేలాది మంది కమ్మ సంఘం నాయకులతో పాటు కమ్మకులస్తులు వనభోజనానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కమ్మ సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పాటు అందించాలన్నారు. మహానంది పుణ్యక్షేత్రంలో కొనే్నళ్లుగా కమ్మకులస్తుల ఆధ్వర్యంలో కుల, మతాలకు అతీతంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. అన్నదాన సత్రం నిర్మాణానికి అల్లీనగరం గ్రామానికి చెందిన సీతారామయ్య దంపతులు, కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని విరాళంగా అందించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు. సత్రం నిర్మాణానికి ప్రతి ఒక్కరు తమ వంతు సహకారం అందించాలన్నారు. కార్యక్రమంలో అన్నసత్రం అధ్యక్షులు దూదిపల్లి వెంకటరమణ, గౌరవాధ్యక్షులు కంచర్ల సురేష్‌రెడ్డి, కంచర్ల ఈశ్వరయ్య, పోలూరు భాస్కర్‌రెడ్డి, మల్లేష్ చౌదరి, దుర్గాప్రసాద్, వెంకటేశ్వర నాయుడు, సుబ్బారావు, రమేష్ చంద్ర, వెంకటరావు, చక్రవర్తి, వెంకటరమణ, అప్పారావు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పలువురిని సన్మానించారు. ఈ సందర్భంగా నంద్యాల శాంతినికేతన్ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రొద్దుటూరుకు చెందిన మ్యూజీషియన్ హరిరామ్ చేసిన మ్యాజిక్ సభికులను అలరించాయి.

యోగాతో వ్యాధులు దూరం
ఆదోని, నవంబర్ 29: యోగాతో వ్యాధులు దూరమవుతాయని మాస్టర్ వేణుగోపాల్, టిడిపి ఇన్‌ఛార్జి వీరభద్రగౌడ్ అన్నారు. వివేకానంద యోగా శిక్షణ కేంద్రం 11వ వార్శికోత్సవం యోగా కేంద్రం అధ్యక్షులు సోమశేఖర్‌గౌడ్ అధ్యక్షతన ఆదివారం జరిగింది. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వేణుగోపాల్, వీరభద్రగౌడ్ మాట్లాడుతూ ప్రతి రోజు ఒక గంటపాటు యోగాసనాలు వేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. యోగా కేంద్రం ఏర్పాటుకు తెలుగుదేశం నాయకులు మీనాక్షినాయుడు ఎంతో సహకారం అందించారన్నారు. కేంద్రం నిర్మాణానికి రాయచంద్ మానాజీ పూర్తి సహకారం అందించారన్నారు. ఆదోనివాసులు యోగా కేంద్రం సేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో విశ్వనాథ్, గోవిందరాజుమూర్తి పాల్గొన్నారు.