రాష్ట్రీయం

చత్తీస్‌గఢ్‌లో పేలిన మందుపాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చికిత్స పొందుతూ జవాను మృతి ఇద్దరు డిప్యూటీ కమాండెంట్లకు గాయాలు
చింతూరు/, భద్రాచలం, మార్చి 11: చత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో పోలీసులు లక్ష్యంగా మావోయిస్టుల మందుపాతర పేలడటంతో సిఆర్‌పిఎఫ్‌కు చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్ మృతిచెందాడు. మరో ఇద్దరు డిప్యూటీ కమాండెంట్లు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. సుకుమా జిల్లా కొంటా పోలీసు స్టేషన్ పరిధిలోని బండా- కొంటా గ్రామాల మధ్య రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పనులను పర్యవేక్షించడానికి శుక్రవారం ఉదయం మురళీగూడా బేస్ క్యాంపు నుండి 217 సిఆర్‌పిఎఫ్ బలగాలు బయల్దేరాయి. బేస్ క్యాంపునకు 500 మీటర్ల దూరంలో మావోయిస్టులు అమర్చిన శక్తిమంతమైన ఐఇడి బాంబుపై ఒక జవాను కాలు మోపడంతో మందుపాతర పేలింది. దీంతో డిప్యూటీ కమాండెంట్ బికె నివాస్, ప్రభాకర్ త్రిపాఠి, హెడ్ కానిస్టేబుల్ రంగా రాఘవన్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని హుటాహుటిన తెలంగాణలోని భద్రాచలం క్లస్టర్ ఏరియా వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. వీరిలో హెడ్‌కానిస్టేబుల్ రంగా రాఘవన్ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇద్దరు డిప్యూటీ కమాండెట్లకు చికిత్స అందిస్తున్నారు. ప్రథమ చికిత్స అనంతరం ప్రత్యేక హెలీకాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ హెడ్ కానిస్టేబుల్ రాఘవన్ మృతిచెందాడు. కాగా సంఘటనా స్థలం సమీపంలో మావోయిస్టులు ఒక లేఖను చెట్టుకు తగిలించి వెళ్లారు. ఈ లేఖలో పోలీసు ఉన్నతాధికారుల మాటలు పాటించి జవాన్లు ప్రాణాలు పోగొట్టుకోవద్దన్నారు. జవాన్లు జీతం కోసం, మావోయిస్టులు బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి పనిచేస్తున్నారన్నారు. మందుపాతర పేలిన ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతానికి పోలీసు బలగాలను పంపి, విస్తృతంగా కూంబింగ్ చేపడుతున్నట్టు కుసుమా జిల్లా ఎఎస్పీ సంతోష్ సింగ్ తెలిపారు. (చిత్రం)గాయపడిన డిప్యూటీ కమాండెంట్‌కు చికిత్స అందిస్తున్న దృశ్యం ** మావోయిస్టుల కాల్పుల్లో మృతిచెందిన రాఘవన్